సుషాంత్ కేసులో కొట్టేసుకున్నారు.. 7ఏళ్ల బాలుడి కిడ్నాప్ కేసును కలిసి చేధించారు

  • Publish Date - October 24, 2020 / 07:56 PM IST

Mumbai Bihar cops : బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో దర్యాప్తు విషయంలో ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకున్న ముంబై, బెంగళూరు పోలీసులు ఓ మైనర్ కిడ్నాప్ కేసును మాత్రం విజయవంతంగా కలిసి ఛేదించారు. ఈ నెలలో చాంపరన్ జిల్లాకు చెందిన మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.



బాలుడి కిడ్నాప్ కేసు ముందుగా బిహార్ పోలీసుల దృష్టికి వచ్చింది. ఏడేళ్ల బాలుడి కుటుంబ సభ్యులు బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 14న బిహార్ లోని చాంపరన్ జిల్లా, గాన్హా పోలీసు స్టేషన్‌ పరిధిలో కిడ్నాప్ అయ్యాడు.

అక్టోబర్ 19న తమకు కిడ్నాప్ బెదిరింపు కాల్ వచ్చిందని, రూ.20 లక్షలు డిమాండ్ చేశారంటూ బాలుడి కుటుంబ సభ్యులు బిహార్ పోలీసులకు చెప్పారు.



అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే పిల్లాడి చంపేస్తామని బెదిరించారని వాపోయారు. కిడ్నాపర్ ఫోన్ కాల్ ను ట్రేస్ చేసిన బిహార్ పోలీసులు అది.. ముంబైలోని కండివాలి ప్రాంతం నుంచి వచ్చినట్టు గుర్తించారు. వెంటనే బిహార్ పోలీసులు ముంబై పోలీసులను సంప్రదించారు.



వెంటనే రంగంలోకి దిగిన ముంబై పోలీసులు అక్టోబర్ 20న కండివాలికి చెందిన నిందితుడు రియాసుదిన్ అన్సారీని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బిహార్ పోలీసులకు అప్పగించారు. నిందితుడి కాల్ డేటా వివరాలను కూడా బిహార్ పోలీసులకు అప్పగించారు.



నిందితుడితో పాటు మరో ముగ్గురు Alauddin Ansari, Khan Muhammad Ansari (35) and Muslim Ansari (35) నిందితుల పేర్లను బయటపెట్టాడు. కిడ్నాప్ చేసిన బాలుడిని ఎక్కడ దాచిపెట్టారని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. యూపీలోని కుషినగర్ జిల్లాలో దాచామని చెప్పారు.



హుటాహుటినా ఫారెస్ట్ ఏరియాకు చేరుకున్న పోలీసుల ఏడేళ్ల బాలుడిని రక్షించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులు బాధిత ఫ్యామిలీకి తెలిసినవారేనని విచారణలో వెల్లడించారు.