కోటాలో యువతి కిడ్నాప్ కేసు.. ట్విస్టులే ట్విస్టులు

కిడ్నాప్ తన కూతురి ఫొటోను ఫోన్‌లో చూడగానే భయాందోళనతో ఆ తండ్రి వణికిపోయాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తాడు.

Kota Kidnap Case: తాళ్లతో కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డెలు కుక్కిన కూతురి ఫొటో చూసిన వెంటనే ఈ తండ్రి భయాందోళనతో వణికిపోయాడు. కోచింగ్ తీసుకోవడానికి వెళ్లిన కూతురు కిడ్నాప్ అయిందని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తండ్రి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు కూతురే కిడ్నాప్ డ్రామా ఆడిందని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగింది?
కిడ్నాప్ అయిన తన కూతురిని కాపాడాలంటూ మధ్యప్రదేశ్ శివపురి జిల్లా బైరాద్ ప్రాంతానికి చెందిన రఘువీర్ ధాకడ్ సోమవారం స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. రాజస్థాన్ కోటా నగరంలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న తన కుమార్తెను ఎవరో అపహరించారని, ఆమెను విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు రూ. 30 లక్షలు డిమాండ్ చేస్తున్నారని పోలీసులతో ఆయన చెప్పాడు. అంతేకాదు తన కూతురిని తాళ్లతో కట్టేసి ఉన్న ఫొటోను తన ఫోన్ కు పంపించారని చూపించాడు. మరోవైపు రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఫోన్ చేసి యువతిని కాపాడాలని కోరారు. దీంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. వెంటనే రంగంలోని పోలీసులు తమ పని ప్రారంభించారు. సదరు యువతి కిడ్నాప్ కాలేదని తేల్చారు.

Also Read: మేడపైకి తీసుకెళ్లి.. లైట్లు ఆఫ్ చేసి ఇద్దరు చిన్నారులపై కిరాతకం.. భయానక ఘటన

కోటాలో కాదు.. ఇండోర్ లోనే ఉంది
కిడ్నాపయినట్టుగా చెబుతున్న యువతికి ఎటువంటి హాని జరగలేదని కోటా ఎస్పీ అమృత దుహాన్ మీడియాతో చెప్పారు. సదరు యువతి స్నేహితురాలిని తాము ప్రశించామని కిడ్నాప్ డ్రామా అని తేలినట్టు వెల్లడించారు. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళుతున్నట్టు సీసీకెమెరా ఫుటేజీలో కనబడిందని అన్నారు.

”ఆమెకు ఇండియాలో ఉండి చదుకోవడం ఇష్టం లేదు. విదేశాల్లో చదువుకోవడానికి డబ్బు కోసమే కిడ్నాప్ డ్రామా ఆడింది. ఆమె అసలు కోటాలోనే లేదు. గత ఏడు నెలలుగా ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి ఇండోర్ లోనే ఉంటుంది. నీట్ కోచింగ్ కోసం తన తల్లితో కలిసి గతేడాది ఆగస్టు 3న ఆమె కోటా నగరానికి వచ్చింది. రెండు మూడు రోజులు ఉండి ఆ తర్వాత తన స్నేహితులను కలిసేందుకు ఇండోర్‌ వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. అయితే ఈ విషయం తన తల్లిదండ్రులతో చెప్పలేదు. తాను కోటాలోనే కోచింగ్ తీసుకుంటున్నట్టు పేరెంట్స్ ను నమ్మించింది. విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి డబ్బుల కోసం తన స్నేహితులతో కలిసి తాజాగా కిడ్నాప్ డ్రామా ఆడింద”ని ఎస్పీ అమృత దుహాన్ వివరించారు. అయితే ఆమె ఎక్కడ ఉన్నది ఇంకా తెలియలేదని చెప్పారు. ఇంటికి తిరిగి రావాలని, ఏదైనా సహాయం కావాలంటే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని సదరు యువతికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. తమ కూతురు సురక్షితంగా తిరిగి రావాలని ఆమె తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

Also Read: రాత్రి పూట వీడియోలు తీసి వేధింపులు.. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళన

ట్రెండింగ్ వార్తలు