జగన్ పై దాడి కేసు : ఆ… డాక్యుమెంట్లు నిందితునికి ఇవ్వలేం : ఎన్ఐఏ  

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో విచారణ చేపట్టిన డాక్యుమెంట్లను నిందితునికి ఇవ్వలేమని ఎన్ఐఏ స్పష్టం చేసింది.

  • Publish Date - January 23, 2019 / 10:32 AM IST

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో విచారణ చేపట్టిన డాక్యుమెంట్లను నిందితునికి ఇవ్వలేమని ఎన్ఐఏ స్పష్టం చేసింది.

విజయవాడ : వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో విచారణ చేపట్టిన డాక్యుమెంట్లను నిందితునికి ఇవ్వలేమని ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసులో విజయవాడ కోర్టులో ఎన్ఐఏ చార్జీషీట్ దాఖలు చేసింది. విచారణకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని నిందితుడి తరపు న్యాయవాదులు అడిగారు. అయితే ఏ కేసులో లేనిది నిందితుడికి ఈ కేసులో డాక్యుమెంట్లు ఎందుకు ఇవ్వాలని ఎన్ఐఏ ప్రశ్నించింది. నిందితుడికి డాక్యుమెంట్లు ఇవ్వలేమని ఎన్ఐఏ స్పష్టం చేసింది. మరోవైపు నిందితుడు శ్రీనివాస్ జైలులో రాసిన 22 పేజీల పుస్తకాన్ని ఎన్ఐఏ చార్జిషీట్ లో జతచేసింది. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాస్ కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.