జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ 

వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది.

  • Publish Date - January 31, 2019 / 08:16 PM IST

వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది.

విజయవాడ : వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. జగన్ పై దాడి కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. దాడికి ముందే శ్రీనివాసరావు ఫుడ్ కోర్టులోని సహ ఉద్యోగులతో చర్చించినట్లు చార్జిషీట్ లో పేర్కొంది. జగన్ గాయం తీవ్రమైనది కాదని ఎన్ఐఏ రిపోర్ట్ తెలిపింది. జగన్ ఎడమ భుజంపై గాయమైందన్న డాక్టర్ నివేదికను చార్జిషీట్ లో ప్రస్తావించింది. సిట్ రిపోర్టుతోపాటు ఎన్ఐఏ ఏకీభవించింది. 

విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాసరావు కోడి కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జగన్ పై దాడి కేసు ఏపీలో సంచలనం కలిగించింది. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. జగన్ పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది. కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై సీఎం చంద్రబాబు వ్యతిరేకత వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టారు. 

ట్రెండింగ్ వార్తలు