Pratapgarh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం దారుణ ప్రమాదం జరిగింది. జిల్లాలోని లీలాపూర్ ప్రాంతంలో ఆటోను గ్యాస్ ట్యాంకర్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా తొమ్మిది మంది మృతి చెందారు. ఇక ఇదే ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్ ఆస్పత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు. జెత్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని భైరవపూర్ నివాసి, 26 ఏళ్ల ఆటో డ్రైవర్ సతీష్ గౌతమ్ తన వాహనంలో 15 మంది ప్రయాణికులను మోహన్‌గంజ్‌కు తీసుకువెళుతున్నాడు. లీలాపూర్ ప్రాంతంలోని విక్రమ్‌పూర్ మలుపు దగ్గరకు ఆటో వారణాసి-లక్నవూ హైవేపై ఎదురుగా వస్తున్న ట్యాంకర్ స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయింది. ఆటోను ట్యాంకర్ ఢీకొని హైవేపై బోల్తా పడింది.
ICC World Cup 2023 : ఒక వేళ పాకిస్తాన్ ప్రపంచకప్ ఆడకుంటే.. ఆ జట్టు స్థానంలో ఆడేది ఎవరంటే..?
స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో ఉన్న ప్రయాణికులను రక్షించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, వారిలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరిని ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్ ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో ఆరుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. అంబులెన్స్ డ్రైవర్లు వారి మృతదేహాలతో ప్రతాప్‌గఢ్‌కు తిరిగి వచ్చారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు.
Pawan Kalyan : ఇంట్లోకి దూరే అవకాశం ఇచ్చారు.. వాలంటీర్లపై మరోసారి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ శ్రీవాస్తవ, అదనపు పోలీసు సూపరింటెండెంట్ (వెస్ట్) రోహిత్ మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుల్లో నలుగురిని ఇక్బాల్ బహదూర్ సింగ్ (40), సతీష్ కుమార్ (35), విమల (38), సతీష్ (40)లుగా గుర్తించారు. మృతదేహాలను శవపరీక్షకు తరలించినట్లు ఏఎస్పీ రోహిత్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన మరికొందరిని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎల్‌పీజీ ట్యాంకర్ రాయ్‌బరేలీ నుంచి వారణాసికి వెళ్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఆయన తెలిపారు.