నీరవ్ మోడీ అప్పగింత కేసు : లండన్‌కు సీబీఐ-ఈడీ బృందం

బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింత కేసు విషయంలో సీబీఐ-ఈడీ జాయింట్ బృందం త్వరలో లండన్ కు బయల్దేరనుంది.

  • Publish Date - March 27, 2019 / 08:40 AM IST

బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింత కేసు విషయంలో సీబీఐ-ఈడీ జాయింట్ బృందం త్వరలో లండన్ కు బయల్దేరనుంది.

బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింత కేసు విషయంలో సీబీఐ-ఈడీ జాయింట్ బృందం త్వరలో లండన్ కు బయల్దేరనుంది. పీఎంఎల్ఏ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ కు ఇటీవల లండన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. కోర్టు ఆదేశాల మేరకు అక్కడి పోలీసులు నీరవ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నీరవ్.. బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై లండన్ కోర్టులో విచారణకు రానుంది.

ఈ కేసు విషయమై అక్కడి స్థానిక అధికారులకు సహకారం అందించేందుకు సీబీఐ-ఈడీ జాయింట్ బృందం వెళ్లనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. సీబీఐ, ఈడీ నుంచి జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులు నీరవ్ అప్పగింతకు సంబంధించిన పత్రాలతో లండన్ కు సిద్ధమవుతున్నట్టు అధికారి ఒకరు చెప్పారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారి కూడా నీరవ్ మోడీ భార్య అమికి సంబంధించి ఆస్తుల అటాచ్ మెంట్ పై దాఖలైన లేటెస్ట్ ఛార్జ్ షీట్ ను కూడా తీసుకెళ్లననున్నారు. 
Read Also : జగన్ కూడా రెడీ.. కేసీఆర్‌ను ఢిల్లీకి పంపిద్దాం : కేటీఆర్

లండన్ కు వెళ్లగానే ముందుగా సీబీఐ-ఈడీ బృందం పలువురు అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారికి నీరవ్ కేసుకు సంబంధించి సేకరించిన తాజా వివరాలను వివరించనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 2 బిలియన్లు (రూ. 200 కోట్లు) రుణాలుగా తీసుకుని మోసం చేసినందుకు వజ్రాల వ్యాపారి, అతని మామ మెహల్ చోస్కీపై చీటింగ్ కేసు నమోదైంది. దీంతో నీరవ్ ఇండియా నుంచి గుట్టుచప్పుడు కాకుండా లండన్ పారిపోయాడు.

ఇటీవల యూకే కు చెందిన న్యూస్ పేపర్ టెలిగ్రాఫ్ కు నీరవ్ చిక్కాడు. నీరవ్ ను అప్పగించాలనే భారత్ అభ్యర్థన మేరకు లండన్ లో అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో నీరవ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించి రిమాండ్ కు తరలించగా.. రిమాండ్ కస్టడీ గడువు మార్చి 29 వరకు ఉంది. 
Read Also : అంతరిక్ష యుద్ధానికి భారత్ సిద్ధం : మోడీ సంచలన ప్రకటన