Chigurupati Jayaram : NRI చిగురుపాటి జయరాం హత్య కేసు-పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి బెదిరింపులు

ఎన్నారై పారిశ్రామిక వేత్త... ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

Chigurupati Jayaram :  ఎన్నారై పారిశ్రామిక వేత్త… ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇటీవల  ఈ కేసులో సాక్షులుగా ఉన్న స్ధిరాస్తి వ్యాపారి దంపతులను బెదిరించగా… కొత్తగా ఈ కేసు వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నిందితుడు రాకేష్ రెడ్డి అనుచరులు బెదరించారు.

కేసులో నిందితుడుగా ఉన్న రాకేష్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. అతని అనుచరులు అక్బర్ అలీ, గుప్త, శ్రీనివాస్ అనే వారు ఈ కేసు వాదిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్దకు వచ్చారు. ఈకేసులో తమకు అనుకూలంగా వ్యవహరించాలని వారు బెదిరించారు. దీంతో ఆయన జూబ్లీ‌హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాకేష్ రెడ్డి అనుచరులు అక్బర్ అలీ, గుప్త, శ్రీనివాస్ లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read : Mogali Rekulu : నా భర్తకు అమ్మాయిల పిచ్చి… మొగలిరేకులు సీరియల్ దయ బాగోతం

2019 జనవరి 30వ తేదీన చిగురుపాటి జయరాంను హానీ ట్రాప్ ద్వారా జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటినుంచి రాకేష్ రెడ్డి తన నివాసానికి రప్పించాడు. అక్కడ వారిద్దరి మధ్య ఆర్ధిక లావాదేవీల గురించి గొడవ జరిగింది. అనంతరం జయరాంను నిర్భందించి రాకేష్ రెడ్డి హత్యచేశాడు. తర్వాత శవాన్ని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహాదారిలో నందిగామ సమీపంలో పడేశాడు. ఈకేసులో రాకేష్ రెడ్డి మొదటి నిందితుడిగా చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నాడు. ఈ బెదిరింపులన్నీ రాకేష్ రెడ్డి  చంచల్ గూడ జైలు నుంచే ఆపరేట్ చేస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు