Biryani
Suicide For Biryani : బుద్ధిగా స్కూల్ కి వెళ్తూ చక్కగా చదువుకోవాల్సిన వయసు. తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ సరదాగా జీవితాన్ని గడపాల్సిన వయసు. అలాంటి వయసు పిల్లలు.. క్షణికావేశాలకు లోనై.. తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పడి కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు.
కొత్త దుస్తులు కొనివ్వలేదనో, ఫోన్ కొనివ్వలేదనో, సైకిల్ కొనివ్వలేదనో కొందరు.. తల్లిదండ్రులు మందలించారని, టీచర్ తిట్టిందని మరికొందరు.. మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. పిల్లల్లో ఈ విపరీత ప్రవర్తన ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా తండ్రి బిర్యానీ తీసుకురాలేదని 13 ఏళ్ల కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది.
Nellore : ట్రాన్స్‌జెండర్ మర్మాంగాలు తొలగించిన బీ ఫార్మసీ విద్యార్థులు
బాలాసోర్ జిల్లాలోని గోబింద్ పూర్ గ్రామానికి చెందిన మనోరంజన్ మహన్న ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడి కుమారుడు స్థానిక స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా, కొన్ని రోజులుగా ఆ బాలుడు బిర్యానీ తీసుకురమ్మని తన తండ్రిని కోరుతున్నాడు. అయితే బాలాసోర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మనోరంజన్… ప్రచార పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో బిర్యానీ సంగతి మర్చిపోయేవాడు. అలానే ఇంటికి వెళ్లేవాడు. తండ్రి రోజూ ఖాళీ చేతులతో ఇంటికి రావడం చూసిన బాలుడు తీవ్ర నిరాశకు గురయ్యేవాడు. బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టం అని, ఇవాళ అయినా కచ్చితంగా తీసుకురావాలని బుధవారం కూడా తండ్రిని కోరాడు కొడుకు. అయితే ఆయన ఇంటికి రావడం ఆలస్యమైంది. దీంతో మనస్తాపం చెందిన బాలుడు తన గదిలో పైకప్పుకి ఉరేసుకున్నాడు.
Supari Murder : భర్తతో విసిగిపోయిన భార్య..సుపారీ ఇచ్చి హత్య
కాసేపటికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు బాలుడిని ఉరికి వేలాడుతుండటం చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే బాబుని కిందకి దించి ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు భోరున విలపించారు. ప్లేట్ బిర్యానీ కోసం తన కొడుకు ఆత్మహత్య చేసుకుంటాడని అస్సలు ఊహించలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది.
”బిర్యానీ తీసుకురావాలని రోజూ నా కొడుకు అడిగేవాడు. అయితే, నేను మర్చిపోయేవాడిని. బుధవారం కూడా అలానే కోరాడు. ఎన్నికల్లో బిజీగా ఉండి బిర్యానీ తీసుకోవడం మర్చిపోయాను. దీన్ని నా కుమారుడు హృదయానికి తీసుకున్నాడు. తన జీవితాన్ని ముగించుకున్నాడు. ప్లేట్ బిర్యానీ కోసం నా కొడుకు ఆత్మహత్య చేసుకుంటాని నేను అస్సలు ఊహించనే లేదు” అని తండ్రి మనోరంజన్ విలపించాడు.