ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కారు ఢీకొని యువకుడి మృతి

  • Published By: madhu ,Published On : March 31, 2019 / 06:31 AM IST
ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కారు ఢీకొని యువకుడి మృతి

Updated On : March 31, 2019 / 6:31 AM IST

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని తిరిగి వస్తున్న తెనాలి TDP ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కారు ఢీకొని ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు. కారులో ఎమ్మెల్యే సతీమణి ఉన్నారు. ఈ ఘటన హాఫ్ పేట వద్ద చోటు చేసుకుంది. యువకుడి మృతిపై గ్రామస్తులు, కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడిన యువకుడిని తెనాలి ప్రభుత్వసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకుని కారును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈయన సతీమణి కారులో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. మార్చి 30వ తేదీ రాత్రి నివాసానికి తిరిగి వస్తున్నారు. హఫే పేట వద్దకు రాగానే ఈమె ప్రయాణిస్తున్న కారు..బైక్‌పై వెళుతున్న వారిని ఢీకొంది. ఘటనాస్థలంలోనే పవన్ కుమార్ అక్కడికక్కడనే చనిపోయాడు. గాయాలపాలైన మరొక వ్యక్తిని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మంగళగిరి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఇతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల కార్లు అంత వేగంగా ఎందుకెళ్లాలి ? దురుసుగా ప్రవర్తించాలా ? అంటూ మృతుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
Read Also : సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం