డ్రాగన్ టార్గెట్ ఇండియా.. భారతీయ యువతే చైనా చీటర్స్ లక్ష్యం.. ముందుగా మాటల్లో పెడతారు.. ఆ తర్వాత ఆటలో దించుతారు. ఆన్ లైన్ గేమ్ రుచి చూపించి జేబులు గుల్ల చేస్తారు.. ఆన్ లైన్ గేమ్ ఎలా ఆడతారు.. గేమింగ్ కోసం డబ్బులను చైనా చీటర్స్ మాయచేస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్ ఉచ్చులో భారతీయ యువత పడుతుంది.. ఈజీ మనీ అంటూ ఎరవేస్తూ నెమ్మదిగా గేమ్ లోకి దించి ఆట ఆడేసుకుంటారు.. కోట్లు కొల్లగొట్టి జేబులు ఖాళీ చేస్తారు.. ఆన్ లైన్ ద్వారా రూ. 1100 కోట్లు లావాదేవీలు జరిపినట్టు సైబర్ పోలీసులే షాక్ అయ్యారు..
చైనా వారితో పాటు కొందరు భారతీయులను అరెస్ట్ చేశారు. ఆన్ లైన్ గేమ్ లతో జర భద్రమని పోలీసులు అంటున్నారు. కొందరు మూవీలపై ఆసక్తి చూపిస్తుంటే.. మరికొందరు ఆన్ లైన్ గేమ్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు… ఇదే సైబర్ చీటర్లకు వరంగా మారింది. గేమింగ్ కంపెనీల పేరుతో మోసాలకు తెగబడుతున్నారు.. కోట్లు కొల్లగొడుతున్నారు…
కొల్లగొట్టినా డబ్బుంతా గుర్ గావ్ హెచ్ఎస్బీసీ బ్యాంకు అకౌంట్లోకి బదిలీ చేసినట్టు తెలిపారు. దాదాపు రూ.30 కోట్ల వరకు సీజ్ చేశారు.. తెలంగాణ ఆన్ లైన్ గేమ్ పర్మిషన్ యాక్ట్ కింద.. రాష్ట్రంలో ఆన్ లైన్ బెట్టింగులు, గేమ్ ఆడినా నేరం.. హైదరాబాద్ సైబర్ పోలీసులకు గేమింగ్ గురించి రెండు ఫిర్యాదులు అందాయి.
ఆన్ లైన్ గేమింగ్‌తో రూ. 96వేలు ఒకసారి.. లక్షా 64వేలు మరోసారి మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడో బాధితుడు.. విచారణ చేపట్టిన సైబర్ పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.. చైనా కేంద్రంగా ఆన్ లైన్ గేమింగ్ పేరిట బెట్టింగ్‌లతో వందల కోట్లు చీటింగ్ పాల్పడినట్టు గుర్తించారు. ఈ కేసులో ఒక చైనీస్ వ్యక్తితో పాటు ముగ్గురు తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆన్ లైన్ గేమింగ్ మోసాలకు వీరు
సహకరించినట్టు విచారణలో తేలింది.
చైనా ఆధారిత గేమింగ్ కంపెనీల్లో గ్రోవింగ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, సిల్లీ కన్సల్టింగ్ సర్వీసు.. పాన్ యన్ టెక్నాలజీ, లింగ్ క్యూ, డోకీ పే, స్పాట్ ఫే, డైసీలిక్ ఫైనాన్షియల్, హువాహో ఫైనాన్సియల్ సంస్థలుగా గుర్తించినట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఆయా కంపెనీలకు డైరెక్టర్లుగా చైనాతో పాటు ఇండియన్స కూడా ఉన్నారని గుర్తించారు.. రహుల్ మంజల్, లింగ్ యాంగ్, మింగ్ యాంగ్, జిమ్లింగ్ యాంగ్, నీరజ్ కుమార్ దిల్లీ, దీరజ్ సర్కార్, గుర్గావ్ ఉన్నారని గుర్తించారు.