ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2119 మంది చిన్నారులకు పోలీసులు విముక్తి కలిగించారు.
హైదరాబాద్ : ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2119 మంది చిన్నారులకు పోలీసులు విముక్తి కలిగించారు. ఇళ్లు, ఇటుకబట్టీలు, పరిశ్రమల్లో సంక్షేమశాఖ అధికారులు, పోలీసులు బృందాలు ఏర్పడి దాడులు చేసి 1653 మంది బాలురు, 466మంది బాలికలను రక్షించారు. వారిలో 1303 మంది చిన్నారులను ఇళ్లకు తరలించారు. 816 మందిని బాలసదన్‌లో చేర్పించారు. చిన్నారుల తల్లిదండ్రులను గుర్తించి అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన 763 మంది చిన్నారులను రక్షించిన అధికారులు.. అక్కడి నుంచి తీసుకువచ్చి పనిలో పెడుతున్నట్లు గుర్తించారు. 18 మంది చిన్నారులు తప్పిపోయి ఇతర చోట్ల ఉండగా.. ఆపరేషన్ స్మైల్‌లో వారిని చేరదీసి దర్పణ్ అనే సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న పలువురు యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.