Telangana : పాల్వంచ ఆత్మహత్య కేసులో సంచలనం రేపుతున్న సూసైడ్ నోట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది.

Palwancha Suicide note

Telangana :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్ లో ముగ్గురి పేర్లు ఉన్నాయి. తన ఆత్మహత్యకు కొత్తగూడెం ఎమ్మేల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేందర్.. రామకృష్ణ తల్లి సుర్యావతి, అక్క మాధవి పేర్లు రాసి ఉన్నాయి. నా ఆత్మహత్యకు వీళ్లు ముగ్గురు కారణం అని సూసైడ్ లెటర్‌లో రామకృష్ణ  పేర్కోన్నాడు.

ఇవాళ తెల్లవారుజామున భార్య, పిల్లలతో కలిసి ఇంట్లో గ్యాస్ లీక్ చేసుకుని ఆ తర్వాత పెట్రోల్  పోసి అంటించుకుని రామకృష్ణ  కుటుంబం ఆత్మహత్యాకు పాల్పడింది.ఈ ఘటనలో రామకృష్ణ‌తో పాటు భార్య, కూతురు సజీవ దహనం కాగా మరో కూతురు కొన ఊపిరి‌తో కొట్టుమిట్టాడుతోంది.

Also Read : Telangana Lockdown : తెలంగాణలో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ…! ఎప్పటి నుంచి అంటే..

రామకృష్ణ సూసైడ్ నోట్  స్వాధీనం చేసుకున్న పోలీసులు  A1 వనమా రాఘవేందర్ పై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశామని…. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నట్లు ఏఎస్పి రోహిత్ రాజ్ తెలిపారు.