Child Murder
Panjagutta Child Murder : పంజాగుట్ట పరిధిలో నాలుగేళ్ల చిన్నారి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. అసలు చిన్నారిని ఎవరు చంపారనేది మిస్టరీగా మారింది. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఘటనా జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరీశీలించారు. అయితే..ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిన రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఆ చిన్నారిని ఎందుకు చంపాల్సి వచ్చింది ? హత్యలో ఎవరు పాల్గొన్నారనే దానిపై వారిని విచారిస్తున్నట్లు సమాచారం.
Read More : Yadadri : విమాన గోపురానికి మంత్రి మల్లారెడ్డి విరాళాల సేకరణ, 11 కిలోల బంగారం
ఈ కేసులో చిన్నారికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందింది. కడుపులో తన్నడం, గొంతు నులిమి చంపినట్లు ఆ రిపోర్టులో వైద్యులు వెల్లడించారు. గతంలో ఆయన గాయాలను గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే చిన్నారిని చంపివేశారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సవతి తల్లి చిత్ర హింసలకు గురి చేసి చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Read More : T.Cong : కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు..కోమటిరెడ్డి ఫ్లెక్సీల చించివేత
పంజాగుట్ట పరిధిలో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం రోడ్డు పక్కన పడేయడం సంచలనం సృష్టించింది. నాలుగు రోజుల క్రితం ఈ హత్య జరిగింది. చిన్నారిని ఎవరు చంపారనేది తెలుసుకోవడానికి..నిందితులను పట్టుకోవడానికి 15 పోలీసు టీంలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. పోలీసుల విచారణలో చిన్నారిని ఎవరు చంపారనేది తెలియరానుంది.