Yadadri : విమాన గోపురానికి మంత్రి మల్లారెడ్డి విరాళాల సేకరణ, 11 కిలోల బంగారం
బంగారం తాపడం కోసం మంత్రి మల్లారెడ్డి కూడా..బంగారం విరాళం ఇచ్చారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఆయన విరాళాలు సేకరించారు. మొత్తం 11 కిలోల వరకు బంగారం విరాళం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Minister Malla Reddy Donated Gold : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి పునర్ నిర్మాణ పనులు శరవేగంగ కొనసాగుతున్నాయి. ఆలయంలో విమాన గోపురం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనికి బంగారం తాపడం చేస్తున్నారు. బంగారం విరాళం ఇవ్వాలని ఆలయ అధికారులు సూచించడంతో..భారీ ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా విరాళం ఇస్తున్నారు. బంగారం తాపడం కోసం మంత్రి మల్లారెడ్డి కూడా..బంగారం విరాళం ఇచ్చారు.
Read More : T.Cong : కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు..కోమటిరెడ్డి ఫ్లెక్సీల చించివేత
ఆయన ఒక కిలో బంగారం ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడ్చల్ నియోజకవర్గంలో ఆయన విరాళాలు సేకరించారు. మొత్తం 11 కిలోల వరకు బంగారం విరాళం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి కుటుంబసభ్యులతో పాటు..నియోజకవర్గ ప్రజలు పూజలు నిర్వహించారు. సేకరించిన విరాళాన్ని ఆలయ అధికారులకు ఆయన అప్పగించనున్నారు. ఈ సందర్భంగా…10tvతో ఆయన మాట్లాడారు. రెండు దఫాలుగా ప్రజల దగ్గరి నుంచి విరాళాలు సేకరించామని, రూ. 3 కోట్ల 26 లక్షలు ప్రజలు స్వచ్చందంగా విరాళాలు ఇవ్వడం జరిగిందన్నారు. విమాన గోపురానికి మళ్ళీ అవకాశం రాదన్న ఆయన…ఇప్పుడే ఇస్తే గోపురానికి ఉపయోగపడుతుందన్నారు. మార్చి 28 తేది యాగంతో యాదాద్రి ఆలయం మొదలు కాబోతోందని..ప్రజలందరూ సహకరించాలన్నారు. తెలంగాణలో ఉన్న ఆలయాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణ అంటే యాదాద్రి అనే మాదిరిగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు.
మరోవైపు..బీజేపీ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై సీఎ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. ధాన్యం కొనుగోలు చెయ్యమని బండి సంజయ్ ఇప్పటికైనా కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ కేంద్రం నుంచి పరిమిషన్ తీసుకురావాలని, హుజురాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజీపీకి అమ్ముడు పోయాడని ఆరోపించారు. హుజురాబాద్ బీజేపీది గెలుపు గెలుపే కాదన్న మంత్రి మల్లారెడ్డి…వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎవరూ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు.
1Sunil: మళ్ళీ హీరోగా సునీల్.. మరోసారి అదే తప్పు చేస్తున్నాడా?
2Assam Homes Demolished: పోలీస్ స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇళ్లు కూల్చివేత
3APDME JOBS : ఏపిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్న ఏపిడిఎమ్ఈ
4Himanta Biswa: రాహుల్ గాంధీపై మండిపడ్డ అస్సాం సీఎం హిమంతా: వాస్తవాలు తెలుసుకోవాలంటూ హితవు
5Minister Harish Rao : పెట్రోల్ పై పెంచింది బారాణా..తగ్గించింది చారాణా : మంత్రి హరీష్ రావు
6ICMR JOBS : ఐసిఎమ్ ఆర్ – ఎన్ఐఈలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీ
7Sangeetha Sajith : ప్రముఖ గాయని మృతి.. నివాళులు అర్పిస్తున్న సినీ పరిశ్రమ..
8Telangana Rains : తెలంగాణాలో రాగల మూడు రోజులు వర్షాలు
9Pooja Hegde : కాన్స్ చిత్రోత్సవానికి వెళ్తుండగా పూజాహెగ్డేకు చేదు అనుభవం.. పోలీసులకి కంప్లైంట్ చేసిన పూజా..
10Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం-8 మంది మృతి
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం