Women Warned BJP MLA : మా ఊరికి రోడ్డు వేయకపోతే ‘చెప్పులతో కొట్టి చంపేస్తాం’బీజేపీ ఎమ్మెల్యేకు మహిళల హెచ్చరిక

మా ఊరికి రోడ్డు వేయకపోతే ‘చెప్పులతో కొట్టి చంపేస్తాం' అంటూ మహిళలు బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు.

Women Warned BJP MLA : మా ఊరికి రోడ్డు వేయకపోతే ‘చెప్పులతో కొట్టి చంపేస్తాం’బీజేపీ ఎమ్మెల్యేకు మహిళల హెచ్చరిక

Women Warned Bjp Mla

UP Women Warned BJP MLA ravi sonkar : ఎన్నికలప్పుడు రాజకీయ నేతలు వాగ్ధానాలు చేయటం తరువాత వాటి సంగతే మర్చిపోవటం సర్వసాధారణమే.మళ్లీ ఓట్లు అవసరం వచ్చినప్పుడు ఏమాత్రం బిడియపడకుండా అది చేస్తాం…ఇది చేస్తాం అంటూ మళ్లీ వాగ్ధానలు కురిపిస్తారు. ప్రజలు కూడా ఓట్లు వేసి గెలిపిస్తారు. కానీ గతంలో తమకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదు కాబట్టి ఈసారి మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగటానికి వచ్చారు? అని ప్రశ్నించరు. కానీ ఓ గ్రామంలో మహిళలు మాత్రం అలా ఊరుకోలేదు. మా గ్రామాన్ని అభివృద్ది చేస్తామనీ..రోడ్డు వేస్తామని వాగ్ధానం చేసి నెరవేర్చని ఓ ఎమ్మెల్యేకు థమ్కీ ఇచ్చారు మహిళలు. ‘‘మేం ఓట్లు వేస్తే అసెంబ్లీకి వెళ్లి మా గ్రామం సంగతి మర్చిపోయి..మళ్లీ వచ్చి ఓట్లు అడగటానికి వస్తే చెప్పులతో కొట్టి చంపేస్తాం’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Read more : UP Election : వచ్చే ఏడాది ఎన్నికలు, అప్పుడే హామీల వర్షం

ఉత్తరప్రదేశ్ లో త్వరంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ బీజేపీ ఎమ్మెల్యేకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేసింది. మా గ్రామానికి వెంటనే రోడ్డు వేయించకపోతే.. చెప్పులతో కొట్టి చంపుతాం అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తర్​ప్రదేశ్ 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో రాజకీయ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు. ఈక్రమంలో ప్రజలు తమ సమస్యల్ని పరిష్కరించకుండా ఓట్లు ఎలా అడుగుతారు? అంటూ నిలదీస్తున్నారు. దీంట్లో భాగంగానే బస్తీ జిల్లాలోని కుద్రాహా బ్లాక్​ ఓ మహిళ బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేకు తీవ్ర స్థాయి హెచ్చరికలు చేస్తు..మా గ్రామానికి రోడ్డు వేయకపోతే చెప్పులతో కొడతామని బహిరంగంగా హెచ్చరించారు.

మహదేవ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా ఎమ్మెల్యే రవి సోంకర్​కు వ్యతిరేకంగా పలువురు మహిళలు నిరసన చేపట్టారు. చెప్పులు చేతిలో పట్టుకొని ఎమ్మెల్యేకు హెచ్చరికలు చేశారు. తక్షణమే తమ గ్రామంలో రోడ్డు నిర్మాణం ప్రారంభించకపోతే.. ఎమ్మెల్యేకు చెప్పులతో స్వాగతం పలుకుతామని శకుంతలాదేవి అనే మహిళ అన్నారు.

Read more : UP Election 2022: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. అఖిలేష్ సంచలన ప్రకటన!

అభివృద్ధి అనేది మాటలకు..కాగితాలకే పరిమితం చేస్తున్నారని..మా గ్రామంలో వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావాలి. లేదంటే ఎమ్మెల్యే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోడ్లు లేకపోవడం వల్ల మా గ్రామంలో చాలా మందికి వివాహాలు కూడా కావడం లేదు. ఇక్కడి ప్రజలే రవి సోంకర్​కు ఓట్లేసి అసెంబ్లీకి పంపించాం. కానీ ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే రోడ్డు వేయించలేకపోయారు. కాబట్టి ఆయనకు ఓట్లు అడిగే హక్కు లేదు. వెంటనే రోడ్డు వేయించకపోతే ఎమ్మెల్యేకు చెప్పులతో స్వాగతం పలుకుతాం. చెప్పులతోనే కొట్టి చంపేస్తాం అంటూ శకుంతలా దేవి చేసిన హెచ్చరికలు హాట్ టాపిక్ గా మారాయి.

కాగా శకుంతలా దేవి బీజేపీ మహిళా మోర్చలో విభాగానికి మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. ఎమ్మెల్యే రవి సోంకర్​తో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈక్రమంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మా గ్రామానికి రోడ్డు వేయించకపోతే ఎమ్మెల్యేకు చెప్పులతో పరాభవం తప్పదని ఆమె తీవ్రస్థాయిలో హెచ్చరించారు.