UP Election 2022: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. అఖిలేష్ సంచలన ప్రకటన!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అఖిలేష్ యాదవ్.

UP Election 2022: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. అఖిలేష్ సంచలన ప్రకటన!

Akhilesh

UP Election 2022: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అఖిలేష్ యాదవ్. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయడం కోసమే ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు అఖిష్ యాదవ్. రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర చేపట్టి తనకు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించుకుంటున్న అఖిలేష్ యాదవ్.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రత్యేకంగా ఓ అసెంబ్లీ స్థానం నుంచి మాత్రం పోటీ చేయనని ప్రకటించారు.

ఆర్‌ఎల్‌డీతో పొత్తు విషయమై మాట్లాడుతూ.. రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ)తో పొత్తు, సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని, పొత్తు మాత్రం కాయమేనని, త్వరలో నిర్ణయం తీసుకుని వివరాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం అజంగఢ్ లోక్‌సభ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే, అఖిలేష్ యాదవ్.. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూతో పోల్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది.

యోగి ప్రభుత్వంపై అఖిలేష్ విమర్శలు:
అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. హర్దోయ్‌లో జరిగిన ర్యాలీలో అఖిలేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి రెండు విధులు మాత్రమే ఉన్నాయని అన్నారు. గతంలో సమాజ్‌వాదీ ప్రభుత్వం చేసిన పనుల పేర్లు మార్చడం.. రెండవది ఎస్పీ ప్రభుత్వ పనులను ప్రారంభించడం అని అన్నారు. యోగి జీ రాష్ట్రం కోసం ఎటువంటి కొత్త పనినీ చెయ్యలేదని అన్నారు. యోగీజీ ఓ ‘బాబా ముఖ్యమంత్రి’ అంటూ అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.