10tv ఎఫెక్ట్ : పూజలతో శవం బతకదని కౌన్సిలింగ్

నెల్లూరు : జిల్లాలోని వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామంలో క్షుద్రపూజల కలకలంపై 10 టీవీ ప్రసారం చేసిన కథనాలకు పోలీసులు స్పందించారు. 40రోజులుగా స్మశానంలోనే

  • Publish Date - January 27, 2019 / 05:06 AM IST

నెల్లూరు : జిల్లాలోని వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామంలో క్షుద్రపూజల కలకలంపై 10 టీవీ ప్రసారం చేసిన కథనాలకు పోలీసులు స్పందించారు. 40రోజులుగా స్మశానంలోనే

నెల్లూరు : జిల్లాలోని వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామంలో క్షుద్రపూజల కలకలంపై 10 టీవీ ప్రసారం చేసిన కథనాలకు పోలీసులు స్పందించారు. 40రోజులుగా స్మశానంలోనే ఉంటున్న వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. క్షుద్రపూజలు, చేతబడి, బాణామతి వంటివి లేవని, చనిపోయినవారు బతకడం అసాధ్యమని సదరు కుటుంబానికి చైతన్యం కల్పించారు. గ్రామంలో దండోరా వేయించి.. గ్రామస్థులకు అవగాహన కల్పించారు.

 

* నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజలపై టెన్‌టీవీ కథనాలకు స్పందన
* డిసెంబర్‌లో స్వైన్‌ఫ్లూతో మృతి చెందిన తుపాకుల శ్రీనివాస్
* 40రోజులుగా స్మశానంలోనే శ్రీనివాస్ కుటుంబం
* శ్రీనివాస్‌ను బతికిస్తానంటూ క్షుద్రపూజారి పూజలు
* క్షుద్రపూజలపై టెన్‌ టీవీ వరుస కథనాలు
* టెన్‌ టీవీ కథనాలకు స్పందించిన వెంకటగిరి పోలీసులు
* శ్రీనివాస్‌ కుటుంబానికి పోలీసుల కౌన్సిలింగ్

 

హైటెక్‌ యుగంలోనూ ఆటవిక ఆచారాలు అంతంకావడం లేదు. చేతబడులు, ఆత్మలు, క్షుద్రపూజలంటూ జనం మూఢవిశ్వాసాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అందుకు నిదర్శనమే నెల్లూరులో జరిగిన ఈ సంఘటన. చనిపోయిన వ్యక్తి బతికొస్తాడంటూ.. ఓ మంత్రగాడు చెప్పిన మాటలను నమ్మి 8 లక్షలు సమర్పించుకుంది ఓ కుటుంబం.. సమాధి దగ్గరే పడిగాపులు కాసింది.

 

కాలం మారుతోంది.. పరిస్ధితులు మారుతున్నాయి.. చందమామ మీదకు కూడా వెళ్తున్న రోజులు. కానీ… హైటెక్‌ యుగంలోనూ మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చేతబడులు, ఆత్మలు, చనిపోయిన వ్యక్తులు మళ్లీ బతికి వస్తారన్న ఆశలతో .. కొంతమంది ఎదురుచూస్తూనే ఉన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామంలో చనిపోయిన వ్యక్తి  బతికి వస్తాడన్న ఆశతో .. మృతుని కుటుంబ సభ్యులు 40 రోజులుగా సమాధి దగ్గరే నిరీక్షిస్తున్నారు. కళ్లు కాయలుకాచేలా ఎదురు చూస్తున్నారు. ఆఖరికి తిండి తిప్పలు కూడా సమాధి దగ్గరే కానిచ్చేస్తున్నారు.

 

కడప జిల్లా కోడూరుకు చెందిన తుపాకుల శ్రీనివాసులు .. 40 రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో చనిపోయాడు. అయితే శ్రీనివాసులపై చేతబడి చేసి చంపేశారని మృతుని కుటుంబ సభ్యులను నమ్మించాడు ఓ క్షుద్ర పూజారి. ఆఖరికి చనిపోయిన శ్రీనివాసులను తాను బతికిస్తానని వారిని భ్రమింపచేశాడు. అంతేకాదు ఇదంతా చేసేందుకు 8లక్షల రూపాయలతో డీల్‌ కుదుర్చుకున్నాడు. 41 రోజుల తరువాత సమాధిలో నుంచి శ్రీనివాసులను పైకి లేపుతానని మభ్యపెట్టాడు. ఇదంతా గుడ్డిగా నమ్మిన శ్రీనివాసుల కుటుంబ సభ్యులు 40 రోజులుగా సమాధి దగ్గరే పడిగాపులు కాశారు.

 

విషయం తెలుసుకున్న స్ధానికులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినా .. మృతుని కుటుంబసభ్యులు సమాధి దగ్గరకు ఎవరినీ రానివ్వలేదు. అటువైపు ఎవరు వెళ్ళినా.. కత్తులు, కర్రలతో భయపెడుతున్నారు. ఆధునిక  యుగంలోనూ ఇలాంటి మూఢఘనమ్మకాలను నమ్మడం దురదృష్టకరమంటున్నారు.. జనవిజ్ఞానవేదిక నాయకులు. క్షుద్రపూజలతో అమాయకులను దోచుకుంటూ మోసగిస్తున్నవారిని కఠినంగా శిక్షించాలంటున్నారు. చేతబడులు, వశీకరణం, క్షుద్ర పూజలతో పనులు జరుగుతాయనుకుంటే ఇక సైన్స్‌, డాక్టర్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

 

రోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘనలు జరుగుతూనే ఉంటున్నాయి. ఒక్కోసారి చదువుకున్నవాళ్లు సైతం మోసపూతూనే ఉన్నారు. ఆచరణ సాధ్యం కానికి.. ప్రకృతికి విరుద్ధమైనవి జరుగుతాయనుకోవడం పూర్తిగా భ్రమే. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి.. అపరిచితులను నమ్మి మోసపోకండి..