దిశా నిందితుల ఎన్ కౌంటర్ : జయహో తెలంగాణ పోలీస్..ప్రజల నినాదాలు

  • Publish Date - December 6, 2019 / 03:58 AM IST

దిశా హత్యచారం కేసులో పారిపోయిందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ పెద్ద పెట్టున్న ప్రజలు నినాదాలు చేస్తున్నారు. షాద్ నగర్‌లోని చటాన్ పల్లి వద్దకు భారీగా ప్రజలు చేరుకున్నారు. సోషల్ మీడియాలో పోలీసులను అభినందిస్తున్నారు. జస్టిస్ దిశకు..జస్టిస్ జరిగిందటూ మెచ్చుకుంటున్నారు. పోలీసులపై పూల వర్షం కురిపిస్తున్నారు. ఎన్ కౌంటర్ విషయం తెలిసిన వెంటనే దిశ తల్లి హర్షం వ్యక్తం చేసింది. కానీ తమ బిడ్డ తిరిగి రాదని ఆవేదన వ్యక్తం చేసింది. 

దిశా హత్యాచారం కేసులో పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులు (మహ్మద్‌, జొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్ కుమార్‌)లను 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం చటాన్ పల్లి వద్ద పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. షాద్ నగర్‌లోని చటాన్ పల్లి వద్ద దిశను హత్యాచారం చేశారో..అక్కడే ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ వార్త నిమిషాల్లో దావానంలా వ్యాపించింది. జస్టిస్ దిశకు..జస్టిస్ జరిగిందంటూ ప్రజలు నినదించారు. టాలీవుడ్, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తున్నారు. 
Read More : దిశా నిందితుల ఎన్ కౌంటర్ : స్పందించిన జూనియర్ ఎన్టీఆర్