ఉత్తరాఖండ్‌లో ఓ వ్యక్తి రైలుకు నిప్పు అటించాడు. తనకు ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు అంటించాడు.
ఉత్తరాఖండ్‌లో ఓ వ్యక్తి రైలుకు నిప్పు అటించాడు. తనకు ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు అంటించాడు. ఈ ఘటన హరిద్వార్‌లో చోటు చేసుకుంది. రిషికేశ్-ఢిల్లీ ప్యాసింజర్ రైలుకు నిప్పు అంటించినట్లు తెలుస్తోంది.
తనకు ఐడీ కార్డు ఇవ్వలేదని, అందుకే రైలు బోగీకి నిప్పు అంటించానని నిందితుడు తెలిపారు. సీట్లను చించేశానని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి ఏదైనా క్రిమినల్ రికార్డు ఉందా లేదా అన్న కోణంలో విచారిస్తున్నారు.