హైదరాబాద్ నగర వాసులకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ చిక్కింది. రాచకొండ పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ కి చెందిన ఏడుగురు సభ్యులు..
హైదరాబాద్ నగర వాసులకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ చిక్కింది. రాచకొండ పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ కి చెందిన ఏడుగురు సభ్యులు.. పోలీసుల అదుపులో ఉన్నారు. వారి నుంచి 150 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నగరంలో వరుస దొంగతనాలతో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. నగరవాసుల వెన్నులో వణుకు పుట్టించింది. నవంబర్ నెలలో చెడ్డీ గ్యాంగ్ ఆరు దోపిడీలకు పాల్పడింది. చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు పోలీసులు చేసిన తీవ్ర ప్రయత్నాలు ఫలించాయి. చివరికి వారిని పట్టుకున్నారు.
ఒంటిపై చెడ్డీలు మాత్రమే ధరిస్తారు. కాళ్లు, చేతులకు ఆయిల్ పూసుకుంటారు. ఆ తర్వాత దొంగతనాలకు వస్తారు. ఇదీ చెడ్డీ గ్యాంగ్ ప్రత్యేకత. పట్టుబడకుండా తప్పించుకోవడానికి వారు ఇలా చేస్తారు. బీహార్‌కు చెందిన ఈ ముఠా తెలంగాణ రాష్ట్రంలో హల్ చల్ చేసింది. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల దొంగతనాలు చేసి కలకలం రేపింది. ముఖ్యంగా నగర శివారులో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోయింది. రాత్రి వేళల్లో ఇళ్లలో చోరీకి పాల్పడ్డింది. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న చెడ్డీ గ్యాంగ్ సభ్యులు చోరీలు చేశాక.. వివిధ మార్గాల్లో తప్పించుకుని వెళ్లిపోతున్నారు. తమ ఆచూకీ ఎక్కడా లభించకుండా వారు అనుసరించే మార్గాలు పోలీసులకు ముచ్చెమటలు పట్టించాయి. వారిని పట్టుకోవడం తెలంగాణ పోలీసులకు సవాల్ గా మారింది. చెడ్డీ గ్యాంగ్ కోసం అన్ని మార్గాల్లో వేట మొదలు పెట్టిన పోలీసులు చివరికి సక్సెస్ అయ్యారు.
Also Read : Indian Navy సంచలన నిర్ణయం : స్మార్ట్ ఫోన్‌లు, ఫేస్ బుక్ బ్యాన్