కర్నూలు జిల్లా డోన్ లో పోలీసులు వీధి రౌడీలను మరిపించారు. అత్యంత రాక్షసంగా ప్రవర్తించారు. 50 ఏళ్ల వ్యక్తిని బూటు కాళ్లతో తన్నుతూ దాడి చేశారు.
కర్నూలు జిల్లా డోన్ లో పోలీసులు వీధి రౌడీలను మరిపించారు. అత్యంత రాక్షసంగా ప్రవర్తించారు. 50 ఏళ్ల వ్యక్తిని బూటు కాళ్లతో తన్నుతూ దాడి చేశారు. పోలీస్ స్టేషన్ కు రమ్మంటే రాలేదని బూటు కాళ్లతో తన్నుతూ విచక్షణా రహితంగా దాడి చేసి, జీపులో ఎక్కించారు. పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. డోన్ లోని ప్రభాకర్ రెడ్డి కాలనీకి చెందిన తిమ్మయ్య మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగి వచ్చి ఇంట్లో వాళ్లను వేధింపులకు గురి చేస్తున్నాడు.
తండ్రి తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని తిమ్మయ్యపై కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ కు రావాలని పోలీసులు తిమ్మయ్యకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు ఆదేశించినా తిమ్మయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదు. దీంతో పోలీసులు అతని ఇంటికి వెళ్లి తిమ్మయ్యపై విరుచుకుపడ్డారు. పోలీసులు ఓవరాక్షన్ చేశారు. అత్యంత రాక్షసంగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్ కు రమ్మంటే రాలేదని తిమ్మయ్యను బూటు కాళ్లతో తన్నుతూ పోలీసులు జీపులో ఎక్కించుకున్నారు. అడ్డుకున్న కుటుంబ సభ్యులపైన కూడా పోలీసులు దాడి చేశారు.
కానిస్టేబుల్స్ తో కలుపుకొని నలుగురు పోలీసులు తిమ్మయ్య ఇంటికి వచ్చారు. మద్యం తాగి ఉన్న తిమ్మయ్యను కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. కుటుంబ సభ్యులు కూడా కొట్టవద్దని వేడుకున్నా పోలీసులు వినలేదు. అతని వయసును కూడా లెక్క చేయకుండా బూటు కాళ్లతో తన్నుతూ దాడి చేశారు. వయసును కూడా చూడకుండా తిమ్మయ్య అనే 50 ఏళ్ల వ్యక్తిని బూటు కాళ్లతో తన్నడం కరెక్టు కాదని స్థానికులు తెలియజేస్తున్నారు. పోలీసుల తీరును ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
అయితే పోలీసులు మాత్రం ఇలా చేయడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే కేసు నమోదు చేసుకుని, పోలీసు స్టేషన్ లో దండించాల్సింది పోయి..జనంలో వీధి రౌడీళ్లను మరిపించేలా దాడి చేయడం సరికాదన్నారు. ఇది పోలీసు వృత్తికే కలకం తెచ్చే విధంగా స్థానికులు అంటున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసుల దాడిపై ఇంతవరకు ఎవకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోలేదు. కుటుంబ సభ్యులకు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కంచే చేను మేసిన చందంగా పోలీసుల తీరు ఉంది. కాబట్టి పోలీసులపై కేసు నమోదు చేయలేని పరిస్థితి అని చెప్పవచ్చు.
దాడికి పాల్పడిన పోలీసులపై ఉన్నతస్థాయి అధికారులు, సీఐ, ఎస్సై ఘటనపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలు, సామాన్యులపై దాడి చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. వీళ్లు పోలీసులేనా ప్రశ్నించారు.