Ex DSP Praneeth Rao : సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ.. సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర హార్డ్ డిస్కులలోకి మార్చుకున్నారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఎస్ఐబీ అధికారులు గుర్తించారు.

Ex DSP Praneeth Rao

Ex DSP Praneeth Rao : సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్ పంజాగుట్టలో ప్రణీత్ రావుపై ఎస్ఐబీ(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) అధికారులు ఫిర్యాదు చేశారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు మరికొంత మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎస్ఐబీ కార్యాలయంలో కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు ధ్వంసం చేశారు ప్రణీత్ రావు. ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని రహస్య సమాచారం సేకరించారు ప్రణీత్ రావు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర హార్డ్ డిస్కులలోకి మార్చుకున్నారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఎస్ఐబీ అధికారులు గుర్తించారు. ఎస్ఐబీ అదనపు ఎస్పీ రమేశ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రణీత్ రావుతో పాటు అతడికిసహకరించిన అధికారులపై కేసు నమోదైంది. ప్రణీత్ రావు మీద ఐపీసీ 409, 427, 201, 120(బీ), పీడీపీపీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కేసు ఫైల్ అయ్యింది.

Also Read : ఆమెను భర్తే చంపేసి చెత్త డబ్బాలో వేసి.. ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువతి హత్య కేసులో సంచలన విషయాలు

ట్రెండింగ్ వార్తలు