మసాజ్ ముసుగులో వ్యభిచారం : అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

  • Publish Date - December 13, 2020 / 03:27 PM IST

police busted prostitution rocket : హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో మసాజ్ పార్లర్ పేరుతో జరుగుతున్న వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇహం బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం పోలీసులుకు అందింది. ఈమేరకు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మసాజ్ సెంటర్ పై శనివారం దాడి చేశారు.

పోలీసులు తనిఖీ సమయంలో ముగ్గరు నిర్వాహకులతో పాటు మరో ముగ్గురు విటులను, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు బాధిత యువతులను రెస్క్యూ హోం కు తరలించారు. మరో వైపు రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలో రమేష్ అని వ్యక్తి ఇంటివద్దే మసాజ్ అనే ప్రకటనలు ఇచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఎస్ఓటీ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి మల్కాజ్ గిరి పోలీసులకు అప్పగించారు.