Police Busts Gang for Recording Intimate Moments of Couple in OYO Rooms Through Hidden Cameras
Noida: ఎక్కడికైనా తెలియని ప్రదేశానికి వెళ్లినప్పుడో.. లేదంటే, కాస్త ప్రైవసీ కావాల్సి వచ్చినప్పుడో వెంటనే గుర్తొచ్చే పేరు ఓయో. ఓయో వచ్చాక హోటల్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రజల్లోకి కూడా ఇది విస్తృతంగా వెళ్లింది. ముఖ్యంగా కపుల్స్‌కి ఇది ఫస్ట్ చాయిస్‌గా మారింది. ఓయోకి ప్రజల్లో ఉన్న ఆదరణ సైబర్ నేరగాళ్లకు కూడా అవకాశంగా మారింది. అందుకే ఓయోలని లక్ష్యంగా చేసుకుని కపుల్స్ రహస్య వీడియోలను చిత్రీకరిస్తున్నారు. కొన్ని గ్యాంగులుగా ఏర్పడి ఇలాంటివి చేస్తున్నట్లు తాజాగా నోయిడా పోలీసులు గుర్తించారు.
వీడియోలు తీసి, బెదిరిస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే వారి వీడియోల్ని ఇంటర్నెట్లో పెడతామని బెదిరిస్తున్నారు. ఒకవేళ డబ్బులు అందకపోతే అంత పనీ చేస్తున్నారు. కొందరు డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వలేని కొందరు మానసికంగా కుంగిపోవడం, ఆత్మహత్యలకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయి. దేశంలోని చాలా చోట్ల ఇలాంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓయో గదుల్ని సందర్శించిన కపుల్స్ రహస్య సందర్భాలను వీడియో తీస్తున్న నలుగురు వ్యక్తుల్ని నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు.
విష్ణు సింగ్, పంకజ్ కుమార్, అబ్దుల్ వహావ్, అనురాగ్ కుమార్ అనే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారు తీసిన పలు రహస్య వీడియోల్ని ధ్వంసం చేశారు. అనంతరం ఏడీసీపీ జాద్ మియా ఖాన్ మాట్లాడుతూ కొంత మంది రహస్య వీడియోల్ని చిత్రీకరించి వారిని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో ఒక జంట రహస్య వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. దీంతో విష్ణు, అబ్దుల్లపై కేసు నమోదు అయింది. వారిని అరెస్ట్ చేసి విచారించగా మరో ఇద్దరు ఈ రాకెట్లో ఉన్నట్లు తెలిసింది.