Digvijaya Singh : కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌పై పోలీసు కేసు

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్‌పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌ను పంచుకున్నారనే ఆరోపణలపై దిగ్విజయ్ సింగ్‌పై ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఒక పోలీసు అధికారి తెలిపారు....

Digvijaya Singh

Digvijaya Singh : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్‌పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌ను పంచుకున్నారనే ఆరోపణలపై దిగ్విజయ్ సింగ్‌పై ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఒక పోలీసు అధికారి తెలిపారు. (Police case against Digvijaya Singh)

Heavy Rain Alert : కశ్మీర్ నుంచి కేరళ దాకా భారీవర్షాలు, ఐఎండీ హెచ్చరిక

స్థానిక న్యాయవాది, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాజేష్ జోషి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సింగ్‌పై భారత శిక్షాస్మృతి సెక్షన్ 153-ఎ కింద శనివారం రాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 469,పరువు నష్టం, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తుకోగంజ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ మాజీ చీఫ్ పోస్టర్‌తో ప్రజలను రెచ్చగొట్టినందుకు దిగ్విజయ్‌పై పోలీసు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.  కాంగ్రెస్ నేతలపై తరచూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.