Heavy Rain Alert : కశ్మీర్ నుంచి కేరళ దాకా భారీవర్షాలు, ఐఎండీ హెచ్చరిక
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణశాఖ తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. కశ్మీరు నుంచి కేరళ వరకు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది....

IMD issues Heavy Rain Alert
MD issues Heavy Rain Alert : దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణశాఖ తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వెల్లడించింది. కశ్మీరు నుంచి కేరళ వరకు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాబోయే కొద్ది రోజుల్లో జమ్మూకశ్మీర్, ఢిల్లీ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్,ఉత్తరాఖండ్,హర్యానా, లక్షద్వీప్ తదితర 8 రాష్ట్రాలకు ఐఎండీ భారీవర్షాల హెచ్చరికలు జారీ చేసింది.
Himachal pradesh Flash floods : హిమాచల్‌లో వరదలు..ఐఎండీ హెచ్చరిక
కేరళ, లక్షద్వీప్ లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని ఐఎండీ ట్వీట్ చేసింది. కేరళ రాష్ట్రంలోని 9 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. (8 states of India) కొట్టాయంలో రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. కేరళలోని మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశామనిని ఐఎండీ (IMD) తెలిపింది. కేరళ రాష్ట్రంలో వరదల వల్ల 19 మంది మరణించారు.
Honey Trapped : బీఎస్ఎఫ్ ఉద్యోగిపై పాక్ మహిళా ఏజెంట్ వలపు వల
వరద ప్రాంతాల్లోని 10,399 మందిని సురక్షిత స్థలాలకు తరలించి 227 పునరావాస శిబిరాల్లో ఉంచారు. 1100కు పైగా ఇళ్ల భారీవర్షాల వల్ల దెబ్బతిన్నాయి. 20 సెంటీమీటర్ల వర్షం కురవడంతో పలు జలాశయాల్లోకి వరదనీరు చేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేయడంతో ఆదివారం ఉదంపూర్‌లో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. అంతకుముందు శనివారం, రాంబన్ జిల్లాలో టన్నెల్ 3, 5 లను కలిపే రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో దెబ్బతిన్నది. కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిని తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేశారు. రాష్ట్ర రాజధాని సిమ్లాలో భారీ వర్షాల తర్వాత వరదల కారణంగా కోటి – సన్వారా మధ్య రైల్వే ట్రాక్ మూసివేశారు. లాహుల్,స్పితి జిల్లాలో ఆకస్మిక వరదలు, హిమపాతాలు సంభవించవచ్చని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. ఢిల్లీలో కురిసిన భారీవర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. ఢిల్లీ నగరంలో పలు రోడ్లపై వరదనీరు పారింది.