ఇంకా తాళి కట్టలేదు, పెళ్లి అవలేదు : అప్పుడే అదనపు కట్నం వేధింపులు

అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు వేధింపులకు పాల్పడుతున్నారని అనేక కేసులు విన్నాము, చూశాము. పెళ్లైన కొన్ని రోజులకే ఇలాంటి ఘటనలు జరిగాయి. బాధితులు

  • Publish Date - November 1, 2019 / 06:45 AM IST

అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు వేధింపులకు పాల్పడుతున్నారని అనేక కేసులు విన్నాము, చూశాము. పెళ్లైన కొన్ని రోజులకే ఇలాంటి ఘటనలు జరిగాయి. బాధితులు

అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు వేధింపులకు పాల్పడుతున్నారని అనేక కేసులు విన్నాము, చూశాము. పెళ్లైన కొన్ని రోజులకే ఇలాంటి ఘటనలు జరిగాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా, కర్నూలు జిల్లా శ్రీశైలంలో వింత కేసు వెలుగు చూసింది. ఇంకా తాళి కట్టనే లేదు.. పెళ్లి అవ్వనే లేదు.. కానీ వరుడు అప్పుడే మొదలెట్టేశాడు. అదనపు కట్నం కోసం వేధింపులు స్టార్ట్ చేశాడు.

వివరాల్లోకి వెళ్లితే.. శ్రీశైలం లింగాలగట్టులో శుక్రవారం(నవంబర్ 1,2019) జరగాల్సిన పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. తాళి కట్టే సమయానికి వరుడు యూటర్న్ తీసుకున్నాడు. పెళ్లి కూతురు నచ్చలేదని చెప్పాడు. ఎందుకిలా చేశావ్ అని పెళ్లి కూతురు తండ్రి గట్టిగా నిలదీస్తే.. అప్పుడు అసలు విషయం చెప్పాడు. అదనపు కట్నం కావాలని అడిగాడు. దీంతో పెళ్లి కూతురు తండ్రి, బంధువులు షాక్ తిన్నారు.

వరుడి నిజస్వరూపం తెలిసి కంగుతిన్నారు. వెంటనే వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. వరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదనపు కట్నం కోసం వేధించాడని ఫిర్యాదులో తెలిపాడు. వధువు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.