అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ను గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ ముందు సోమవారం ఉదయం(జనవరి 28,2019) ఆవులను డీసీఎం, ట్రక్కులో తరలిస్తుండగా ఆవుల శబ్దం వినిపించింది. వెంటనే అక్కడి స్థానికులు పోలీసులకు, ఎమ్మెల్యే రాజాసింగ్ కు సమచారం అందించారు.
పోలీసుల కంటే ముందే అవుల దగ్గరకు చేరుకున్న ఎమ్మెల్యే.. స్థానికుల సాయంతో ఆవులను తరలిస్తున్న వ్యాన్‌ను గుర్తించి పట్టుకున్నారు. తరలిస్తున్న డీసీఎం వ్యాన్ డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోకి తీసుకున్నా రాజాసింగ్ వారిని పోలీసులకు అప్పగించారు. పూర్తి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు పోలీసులు.