జయరామ్ హత్యకేసు : నాకు తెలిసిన సమాచారం చెప్పాను : శ్రిఖా

  • Publish Date - February 14, 2019 / 04:11 PM IST

హైదరాబాద్ : జయరామ్ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆఫీస్ లో శ్రిఖా చౌదరి విచారణ ముగిసింది. తెలంగాణ పోలీసులు శ్రిఖా చౌదరిని ప్రశ్నించారు. వెస్ట్ జోన్ డీసీపీ, బంజారాహిల్స్ ఏసీపీలు విచారించారు. 7 గంటలకు పైగా విచారణ జరిగింది. మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని పోలీసులు చెప్పారు. తనకు తెలిసిన సమాచారం పోలీసులకు చెప్పానని శ్రిఖా చౌదరి మీడియాకు తెలిపారు. మళ్లీ విచారణకు పిలిస్తే వస్తానని చెప్పానని వెల్లడించారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు.