కారు యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41
కారు యాక్సిడెంట్ కేసులో హీరో రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న రాజ్ తరుణ్.. పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చాడు. పోలీసులు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. రాజ్ తరుణ్ నుంచి యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సేకరించారు. రెండు రోజుల్లో కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. కాగా రాజ్ తరుణ్ డ్రంక్ డ్రైవ్ చేశాడని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే టెస్ట్ చేసి ఉంటే నిజం తెలిసేదన్నారు.
యాక్సిడెంట్ కేసులో రాజ్ తరుణ్ పై 279, 336 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నార్సింగి దగ్గర రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్ తరుణ్ యాక్సిడెంట్ దృశ్యాలను డిజైనర్ కార్తీక్ వీడియో తీశాడు. ఆ వీడియో ద్వారా డబ్బు కోసం తమను బ్లాక్ మెయిల్ చేశాడని కార్తీక్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర ఫిర్యాదు చేశారు. యాక్సిడెంట్ వీడియోలు మీడియాకు ఇస్తానని కార్తీక్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్టు రాజా రవీంద్ర గురువారం(ఆగస్టు 22,2019) పోలీసులతో చెప్పారు. ఆగస్టు 21న కార్తీక్ తనకి కాల్ చేసి రాజ్ తరుణ్‌కు సంబంధించిన వీడియో తన దగ్గరుందని, రూ.5 లక్షలు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని రాజా రవీంద్ర చెప్పారు.
కార్తీక్ మాత్రం మరోలా చెబుతున్నాడు. ఆ వీడియోలు డిలీట్ చెయ్యాలని రాజ్ తరుణ్ పేరుతో కొందరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించాడు. డబ్బు కోసం తాను బ్లాక్ మెయిల్ చేశానని అనడం అవాస్తవం అన్నాడు. ఇరువురి ఫిర్యాదులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 20న నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ కారు దిగి పరిగెడుతుండగా కార్తీక్ వీడియో తీసినట్టుగా తెలుస్తోంది. ఆ వీడియోలు మీడియాలో వైరల్ అయ్యాయి.