నకిలీ మద్యం తయారీ గోదాంలపై పోలీసులు దాడులు చేశారు.
కర్నూలు : నకిలీ మద్యం తయారీ ముఠా గట్టురట్టు అయింది. నకిలీ మద్యం తయారీ గోదాంలపై పోలీసులు దాడులు చేశారు. వీకర్ సెక్షన్ కాలనీలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ ఇంట్లో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు కృష్ణమూర్తి పరారీలో ఉన్నాడు. స్పిరిట్, కారామల్ నీళ్లతో ముఠా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.