నగ్న చిత్రాల కేసు : వంశీకృష్ణ అరెస్ట్ కి రంగం సిద్ధం

విజయవాడలో సంచలనం రేపిన నగ్న చిత్రాల కేసులో పోలీసులు దర్యాఫ్తు వేగవంతం చేశారు. అసలు సూత్రధారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి.. యువతి

  • Publish Date - August 29, 2019 / 10:53 AM IST

విజయవాడలో సంచలనం రేపిన నగ్న చిత్రాల కేసులో పోలీసులు దర్యాఫ్తు వేగవంతం చేశారు. అసలు సూత్రధారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి.. యువతి

విజయవాడలో సంచలనం రేపిన నగ్న చిత్రాల కేసులో పోలీసులు దర్యాఫ్తు వేగవంతం చేశారు. అసలు సూత్రధారిని పట్టుకునే పనిలో ఉన్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి.. యువతి నగ్న చిత్రాలను తీసి లొంగదీసుకున్న కేసులో సూత్రధారి వంశీకృష్ణ అరెస్ట్ కి విజయవాడ నగర పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆస్ట్రేలియాలో చదువుతున్న వంశీని నగరానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేశారు. మాచవరానికి చెందిన వంశీకృష్ణ ఓ బర్త్ డే పార్టీలో పరిచయమైన యువతిని మాయ మాటలతో లొంగదీసుకున్నాడు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకున్నాడు. తర్వాత ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.

ఆస్ట్రేలియా వెళ్లిన వంశీ… తన దగ్గరున్న వీడియోలను తన ఫ్రెండ్ జగదీష్‌కు పంపించాడు. వాటిని అడ్డం పెట్టుకుని జగదీష్‌ అరాచాకానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. శారీరకంగా వేధించడమే కాకుండా డబ్బు కూడా దండుకున్నాడు. జగదీష్ దగ్గర వీడియోలు ఉండటంతో బాధితురాలు మౌనంగా భరించింది. రోజురోజుకి జగదీష్ అరాచకాలు, డబ్బు డిమాండ్లు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. దీంతో జగదీష్ నిజస్వరూపం బయటపడింది. జగదీష్ ని విచారిస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జగదీష్ కి నగ్న వీడియోలు పంపింది అతడి స్నేహితుడు వంశీ అని గుర్తించారు. ఈ ఘోరం జరగడానికి కారకుడైన జగదీష్‌ స్నేహితుడు వంశీకృష్ణను అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీ అయ్యారు. ఆస్ట్రేలియాలో ఉన్న నిందితుడని తీసుకొచ్చేందుకు జిల్లా కోర్టులో ఓపెన్‌ డేటెడ్‌ వారెంట్‌ పిటిషన్‌ దాఖలు చేయబోతున్నారు. ఆ తర్వాత సీఐడీ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 

ఈ కేసుకి సంబంధించి పోలీసులు జగదీష్‌ మొబైల్‌ ని స్వాధీనం చేసుకున్నారు. అందులోని డేటాని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. జగదీష్ ఇంకా ఎవరినైనా బెదిరించి నగ్న చిత్రాలు తీశాడా అన్న కోణంలో విచారిస్తున్నారు. వంశీకృష్ణ, జగదీష్‌లతోపాటు ఇంకా ఎవరికైనా ఇందులో భాగం ఉందా అనే యాంగిల్ లోనూ పోలీసలు ఎంక్వైరీ చేస్తున్నారు. 19 ఏళ్ల జగదీష్‌ లీలలు చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. కీచకుడిపై అత్యాచారం, కిడ్నాప్‌, మోసం, బలవంతపు వసూళ్లు, బెదిరింపులు, దౌర్జన్యం కేసులు నమోదు చేశారు. జగదీష్, వంశీలను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

జగదీష్ తండ్రి మాత్రం తన కొడుకు అమాయకుడు అని చెబుతున్నారు. తన కొడుకుని కుట్రపూరితంగా ఓ ప్రముఖ వ్యక్తి అరెస్ట్ చేయించారని ఆరోపించారు. తన కొడుకు ప్రేమిస్తున్న అమ్మాయి తండ్రి ఇదంతా చేయించారని, వారిని విడగొట్టడానికే తన పలుకుబడిని ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీ, హర్షిత్ లు కూడా అమాయకులేనని, వంశీ నాలుగేళ్ల క్రితమే ఆస్ట్రేలియా వెళ్లిపోయాడని అతను ఇక్కడ నేరాలు ఎలా చేస్తాడని జగదీష్ తండ్రి ప్రశ్నిస్తున్నారు.