Gadwal Nudecalls Case : గద్వాల న్యూడ్ కాల్స్, బ్లాక్ మెయిలింగ్ కేసులో నిందితులకు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ హరిప్రసాద్ పై బదిలీ వేటు పడింది. ఎస్ఐను నాగర్ కర్నూలు ఎస్పీకి అటాచ్ చేశారు.
న్యూడ్ కాల్స్, బ్లాక్ మెయిలింగ్ కేసులో గద్వాల పోలీసుల తీరుపై అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అసలు నిందితులను వదిలేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరికి పోలీసు ఉన్నతాధికారికి అత్యంత సన్నిహితుడు, అందుకే ఆయన ఒత్తిడి మేరకు పోలీసులు నిందితులకు సహకరించి వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు గద్వాల ఎస్ఐ హరిప్రసాద్ పై బదిలీ వేటు వేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
న్యూడ్ కాల్స్, బ్లాక్ మెయిలింగ్ కేసులో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇదే కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై నిందితుల తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అసలు నేరస్తులను తప్పించి తమ పిల్లలను ఇరికించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసుని సిట్ తో దర్యాఫ్తు చేయించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గద్వాలలో వెలుగుచూసిన న్యూడ్ కాల్స్, బ్లాక్ మెయిలింగ్ కేసు.. తెలంగాణలో సంచలనంగా మారింది. గద్వాలకు చెందిన ఓ వ్యక్తి పార్టీలో బాగా తాగి పడిపోయాడు. ఆ సమయంలో అతడితో ఉన్న మరో వ్యక్తి.. అతడి ఫోన్ లో ఉన్న వీడియో కాల్ రికార్డింగ్స్‌ను చూసి.. వాటిని తన మొబైల్‌తో ఫోటోలు తీసుకున్నాడు. వాటిని తన ఫ్రెండ్ కి చేశాడు. వాటిని చూసిన అతడు కూడా తన ఫ్రెండ్స్‌కి పంపించాలనుకున్నాడు. ఈ క్రమంలో పంపించాలనుకున్న వారితో పాటు మొబైల్‌లో ఉన్న కాంటాక్ట్ నెంబర్లన్నింటికీ ఆ ఫోటోలు షేర్ అయ్యాయి. అనంతరం ఎవరో వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో.. ఈ వ్యవహారం వెలుగు చూసింది, దుమారం రేగింది.
కాగా.. కొందరు వ్యక్తులు.. గద్వాల జిల్లాలో ఉన్న పలు స్కూళ్లు, కాలేజీలకు చెందిన విద్యార్థినిలను, స్థానిక మహిళలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వారికి మాయమాటలు చెప్పి వారితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడటం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని… ఆ మాట్లాడే క్రమంలో వీడియోలను రికార్డు చేశారని పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ న్యూడ్ వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం.