Police Threatening Lovers And Stealing Gold Rings
Police threatening lovers and stealing gold rings : లంచాలు తినటంలో ప్రభుత్వోద్యుగుల్లో పోలీసు డిపార్ట్ మెంట్ చాలా ముందుంటుందని కొన్ని సంఘటనలు స్పష్టం చేస్తుంటాయి. తాజాగా ప్రేమికులను బెదిరించి వారివద్ద ఉన్న బంగారు ఉంగరాలను దోచుకున్న కక్కుర్తి కానిస్టేబుళ్ల ఉదంతం హైదరాబాద్ లోని పేఠ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వీరు చేసిన పని ఒక ఎస్సై, సీఐ మెడకు చుట్టుకుని సస్పెండ్ అయ్యారు.
తమిళనాడుకు చెందిన ఒక యువకుడు ఉపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. సూరారంలోని ఒక హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతని బంధువైన వివాహిత ఐదు నెలల క్రితం హైదరాబాద్ వచ్చింది. సుమారు నాలుగు నెలల క్రితం ఇద్దరూ ఏకాంతంగా గడిపేందుకు బహుదూర్ పల్లిలోని వెంచర్ లోకి వెళ్లారు.
అదే సమంయలో అటువైపుగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్, ఎస్పీవో (స్పెషల్ పోలీసు అధికారి) వీరిని చూశారు. స్టేషన్ కు తీసుకువెళ్తే మీ పరువు పోతుంది. మీ ఇష్టం అంటూ వారిద్దరినీ బెదిరించారు. తమ వద్ద డబ్బులేదని చెప్పటంతో, యువకుడి వద్ద నున్నరెండు ఉంగరాలు బలవంతంగా లాక్కున్నారు. డబ్బులు ఇచ్చి వాటిని తీసుకువెళ్లమని ఆర్టర్ వేసి వెళ్లిపోయారు.
పోలీసులు బెదిరించి ఉంగరాలు లాక్కుని వెళ్లేసరికి మనస్తాపానికి గురైన యువకుడు, మహిళను పంపించి వేసి, నడుచుకుంటూ ఇంటికి వెళ్లసాగాడు. ఆ సమయంలో అటువైపు డయల్ 100 వాహానం వచ్చింది. వారిని చూసిన యువకుడు జరిగిన విషయాన్ని అందులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ కు చెప్పాడు. ఆయన తాను పనిచేసే దుండిగల్ పోలీసు స్టేషన్ ఎస్సై దృష్టికి తీసుకువెళ్లాడు. ఉంగారాలు తీసుకున్న కానిస్టేబుల్, ఎస్పీవో మీద ఫిర్యాదు చేయాలని సూచించారు.
కేసు వద్దని ఉంగరాలు ఇప్పిస్తే చాలని యువకుడు పోలీసులకు చెప్పాడు. అయినా ఎస్సై వదలకుండా కానిస్టేబుల్ , ఎస్టీవోలపై ఫిర్యాదు చేయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్పీవోను విధుల నుంచి తప్పించారు. వారం రోజులు జైలులో ఉండి వచ్చిన కానిస్టేబుల్ బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్ లో దుండిగల్ పోలీసులు న్యాయస్ధానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
దుండిగల్ పోలీసుస్టేషన్ లో ఉండే కోర్టు కానిస్టేబుల్…. నిందితుడైన కానిస్టేబుల్ ది ఒకటే ఊరు. వీళ్లిద్దరూ కుమ్మక్కై స్టేషన్ ఎస్సైకి తెలియకుండానే, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో మాట్లాడారు. తమకు అన్నిరకాలుగా సహకరించేలా ఆయనపై ఒత్తిడి తెచ్చి, ఒప్పించారు. ఉంగారాలు ఎక్కడో పోయాయని బాధితుడితో జడ్జి ముందు సాక్ష్యం ఇప్పించారు. సాక్షులతోనూ అలాగే చెప్పించటంతో జడ్జి కేసును కొట్టివేశారు.
ప్రభుత్వోద్యోగిపై పోలీసు కేసు నమోదైతే శాఖాపరమైన దర్యాప్తు జరుగుతుంది. అందులో భాగంగా ఈ బాధ్యతను ఉన్నతాధికారులు పేట్ బషీరాబాద్ ఏసీపీకి అప్పగించారు. విచారణలో బాధిత యువకుడు…. అప్పటికే తాను కోర్టులో ఒకసారి సాక్ష్యం ఇవ్వటం..పోలీసులు, ఏపీపీ ల ఒత్తిడి ఉండటంతో…. తిరిగి వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించాడు.
ఈవిషయాన్ని ఏసీపీ బాలానగర్ డీసీపీకి తెలిపారు. ఆయన సైబరాబాద్ పోలీసు కమీషనర్ సజ్జనార్ దృష్టికి తీసుకు వెళ్లారు. కేసును కోర్టు కొట్టి వేసిందని తెలుసుకున్నసజ్జనార్ కోర్టు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు లేఖ రాశారు.
సీఐ. ఎస్సై లను కమీషనరేట్ కు ఎటాచ్ చేయాలని నిర్ణయించారు. కోర్టులో మళ్లీ అప్పీలు చేసి నిందితుడైన కానిస్టేబుల్ కు శిక్షపడేలా చేయాలని ఆదేశించారు. ఈకేసు విషయంలో కమీషనరే స్వయంగా రంగంలోకి దిగటంతో, కేసును అప్పీలు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలెట్టారు.