ప్రియాంకారెడ్డి మృతదేహానికి స్పాట్‌లోనే పోస్ట్‌మార్టం

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణ హత్యకు గురైన ప్రియాంకారెడ్డి మృతదేహానికి స్పాట్‌లోనే పోస్ట్‌మార్టం పూర్తైంది. ప్రియాంక మృతదేహాన్ని తగులబెట్టేందుకు పెట్రోల్ వాడారా లేక డీజిల్ వాడారా అన్నది తేల్చే పనిలో పడ్డారు.

  • Publish Date - November 28, 2019 / 10:12 AM IST

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణ హత్యకు గురైన ప్రియాంకారెడ్డి మృతదేహానికి స్పాట్‌లోనే పోస్ట్‌మార్టం పూర్తైంది. ప్రియాంక మృతదేహాన్ని తగులబెట్టేందుకు పెట్రోల్ వాడారా లేక డీజిల్ వాడారా అన్నది తేల్చే పనిలో పడ్డారు.

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణ హత్యకు గురైన ప్రియాంకారెడ్డి మృతదేహానికి స్పాట్‌లోనే పోస్ట్‌మార్టం పూర్తైంది. ప్రియాంక మృతదేహాన్ని.. తగులబెట్టేందుకు.. పెట్రోల్ వాడారా.. లేక డీజిల్ వాడారా అన్నది తేల్చే పనిలో పడ్డారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే.. అసలు విషయం బయటపడనుంది. డెడ్ బాడీని.. ఘటనా స్థలం నుంచి తరలించారు. నిందితుల కోసం.. గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు.. అతికిరాతకంగా హత్య చేశారు. ఆపై పెట్రోల్ పోసి.. మృతదేహాన్ని షాద్‌నగర్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద తగులబెట్టారు. ఎన్‌హెచ్ 44పై ఈ దారుణం జరిగింది. పాలమ్మే వ్యక్తి.. బ్రిడ్జి కింద మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 10 బృందాలతో.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలంలోని.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న సెల్ నెంబర్లను ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

ప్రియాంకారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూరులో వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తోంది. ప్రియాంక సోదరి భవ్య.. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం.. నిన్న మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు.. గచ్చిబౌలిలోని ఒలివా క్లినిక్‌కు ప్రియాంక వెళ్లింది. సాయంత్రం 4 గంటల సమయంలో అక్కడికి చేరుకుంది. క్లినిక్‌లో తన పని ముగించుకొని.. 5 గంటల 50 నిమిషాలకు.. గచ్చిబౌలి నుంచి తిరిగి శంషాబాద్‌లోని తన నివాసానికి బయల్దేరింది. 

ఐతే.. రాత్రి 9 గంటల 22 నిమిషాలకు.. ప్రియాంక తన చెల్లెలికి ఫోన్ చేసింది. తాను శంషాబాద్ టోల్ గేట్ దగ్గర ఉన్నానని.. స్కూటీ పంక్చరైందని చెప్పింది. అక్కడున్న ఓ అజ్ఞాత వ్యక్తి.. తన స్కూటీని రిపేర్ చేయిస్తానని చెప్పినట్లు ప్రియాంక చెల్లికి ఫోన్ లో చెప్పింది. కాసేపయ్యాక.. పంక్చర్ షాపులన్నీ మూసేశారని చెప్పాడని తెలిపింది. ఐతే.. అక్కడి నుంచి కాస్త ముందుకెళ్లాక.. కొందరు లారీ డ్రైవర్లు కనిపించారని.. వారిని చూస్తే తనకు భయమేస్తోందని.. చెల్లితో చెప్పింది ప్రియాంక. 

ఈ ఫోన్ ముగిసిన 22 నిమిషాల తర్వాత.. ప్రియాంక ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయింది. చెల్లి భవ్య.. ఎంత ట్రై చేసినా.. ప్రియాంక ఫోన్ కలవలేదు. దీంతో.. కుటుంబసభ్యుల్లో భయాందోళన పెరిగిపోయింది. చివరిసారి.. 10 గంటల 20 నిమిషాలకు.. చెల్లెలు భవ్య.. తన అక్క ప్రియాంకకు ఫోన్ చేసింది. టోల్ గేట్ దగ్గర ఎంత వెతికినా కనిపించకపోవడంతో.. శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇది జరిగిన కొన్ని గంటల్లోనే.. షాద్‌నగర్‌లో శవమై కనిపించింది ప్రియాంక. దీంతో.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రియాంక తనకు కాల్ చేసి భయమేస్తుందని చెప్పినప్పుడు.. స్కూటీ వదిలి వచ్చేయమని చెప్పినట్లు చెబుతోంది చెల్లెలు భవ్య. అక్క.. స్కూటీ వదిలేసి వచ్చి ఉంటే.. బతికి ఉండేదని.. బోరున విలపిస్తోంది. ప్రియాంక కుటుంబసభ్యులు.. లారీ డ్రైవర్లపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.