రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో సంచలనం సృష్టించిన వెటర్నిటీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసును సైబరాబాద్ పోలీసులు చేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో సంచలనం సృష్టించిన వెటర్నిటీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసును సైబరాబాద్ పోలీసులు చేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు.
అందరూ అనుమానించినట్టే… ప్రియాంక విషయంలో అత్యంత దారుణం జరిగినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు హత్యకు ముందు అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. చీకటి పడటం, ప్రియాంకరెడ్డి ఒంటరిగా ఉండటం, నిర్మానుష్య ప్రదేశం కావడంతో మానవ మృగాలు కిరాతకంగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టి హత్య చేసినట్లు ఖాకీలు కన్ఫర్మ్ చేశారు.
నిందితులంతా ప్రియాంకరెడ్డి స్కూటీని పంక్చర్ చేసి డ్రామాలు ఆడారు. తామే పంక్చర్ వేయిస్తామని చెప్పి.. ఆమె మాటల్లో పెట్టి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెను రేప్ చేసి చంపేశారు. చంపేసిన తర్వాత తమపై అనుమానం రాకుండా ఉండేందుకు.. ప్రియాంక శవాన్ని దూరంగా తీసుకెళ్లి తగులబెట్టారు. అయితే.. బాడీని తీసుకువెళ్లేటప్పుడు అందరికి అనుమానం కలుగుతుందని అనుమానం వచ్చిన లారీ డ్రైవర్లు.. దుప్పటి అడ్డంగా చుట్టారు. కల్వర్టు దగ్గరకు ప్రియాంకరెడ్డి డెడ్‌బాడీని తీసుకువెళ్లిన తర్వాత.. దుప్పటితో సహా కాల్చి చంపారు. ప్రియాంక మృతదేహాం 70 శాతం కాలిపోయింది. నిందితులు మహబూబ్‌నగర్, రంగారెడ్డి వాసులుగా గుర్తించారు. నలుగురు కలిసి ఆమెపై అఘాయిత్యం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
శంషాబాద్‌లో నిన్న దారుణహత్యకు గురైన ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి పరామర్శించారు. తప్పు చేసిన వాళ్లకి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ చెప్పారు. ప్రియాంకరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.