Site icon 10TV Telugu

Prophet Comment Row : అమరావతి కెమిస్ట్ హత్య కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు-హోం మంత్రి అమిత్ షా

Nupur Sharma

Nupur Sharma

Prophet Comment Row :  బహిష్కృత బీజేపీ నేత నుపుర్ శర్మను సమర్ధిస్తూ వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నందుకు రాజస్ధాన్‌లోని ఉదయ్ పూర్ లో కన్నయ్య అనే టైలర్‌ను జూన్ 28న దుండగులు హతమార్చిన ఘటన తెలిసిందే. ఈఘటన జరగటానికి వారం రోజుల ముందు ఇదే తరహాలో నుపురు శర్మ వ్యాఖ్యాలను సమర్దిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసిన మెడికల్ షాపు యజమాని ఉమేష్ కోల్హే హత్యకు గురయ్యాడు.

ఈహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జాతీయ దర్యాప్తు సంస్ధ NIA ను ఆదేశించారు. ఈ కేసులో ఇంతవరకు ఐదుగురిని పోలీసలు అరెస్ట్ చేశారు. నిందితుల పోలీసు కస్టడీని కోర్టు జులై 5వరకు పొడిగించింది.

వివరాల్లోకి వెళితే …..మహారాష్ట్రలోని అమరావతిలో 54ఏళ్ల కెమిస్ట్ ను కత్తితో పొడిచి చంపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో నుపుర్ శర్మకు సపోర్ట్ గా పోస్ట్ చేసినందుకే ఇలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  మొహమ్మద్ ప్రవక్తపై విమర్శలు చేసినందుకు అంతర్జాతీయంగా వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న సమయంలో ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఉమేశ్ ప్రహ్లాద్రావ్ కోలె అనే వ్యక్తి జూన్ 21న హత్యకు గురయ్యారు. విచారణలో భాగంగా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత భార్యతో పాటు షాప్ మూసేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. అదే సమయంలో మరో వాహనంపై అతని కొడుకు సాకేత్(27), కోడలు వైష్ణవి వస్తున్నారు.

“కెమిస్ట్ హత్య విషయంలో ఐదుగురిని అరెస్ట్ చేశాం. ఎన్జీవో నిర్వహిస్తున్న ఇర్ఫాన్ ఖాన్ ను ప్రధాన నిందితుడిగా భావిస్తున్నాం. కోల్హె అమరావతి సిటీలో మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. కొన్ని వాట్సప్ గ్రూపుల్లో నుపుర్ శర్మకు సపోర్ట్ గా వచ్చిన పోస్టును షేర్ చేసినట్లు తెలుస్తుంది. అతను పొరబాటున షేర్ చేసినప్పటికీ ఆ గ్రూపులో అతని కస్టమర్లు, ముస్లిం సభ్యులు కూడా ఉన్నారు” అని అమరావతి కమిషనర్ డా. ఆర్తి సింగ్ శనివారం వెల్లడించారు.

ఇర్ఫాన్ ఖాన్.. ఐదుగురు వ్యక్తులను పురమాయించి ఒకొక్కరికి రూ.10వేలు ఇస్తానని సేఫ్ గా కారులో ఎస్కేప్ అయిపోవచ్చని తీసుకొచ్చాడని నమ్మించాడు. ముద్దిసర్ అహ్మద్ (22), షారూఖ్ పఠాన్ (25), అబ్దుల్ తౌఫిక్ (24), షోయబ్ ఖాన్ (22), అతిబ్ రషీద్ (22) అనే మిగిలిన నిందితులు నలుగురు రోజువారీ కూలీలుగా జీవనం సాగించేవారు. ఘటనాస్థలంలో సీసీటీవీ ఫుటేజి పరిశీలించి దర్యాప్తు జరిపారు. వారి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కొడుకు సాకేత్ కంప్లైంట్ మేరకు విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

Also Read : Nupur Sharma: నుపుర్ శర్మకు సపోర్ట్ చేసి హత్యకు గురైన మరో వ్యక్తి

 

Exit mobile version