మరీ ఇంత కోపమా : తాగొద్దని చెప్తే..12 బైకులు తగలబెట్టేశాడు

  • Publish Date - October 7, 2019 / 09:40 AM IST

పూణేకు చెందిన ఓ వ్యక్తి… పార్కింగ్ ప్లేస్ లో కూర్చుని మందుతాగుతుంటే.. అలా చేయడం నేరం అపండి అని చెప్పినందుకు సదురు వ్యక్తితో గొడవకు దిగాడు. గొడవ కాస్తా పెద్దదై.. తాగద్దని చెప్పినందుకు కోపం వచ్చి అక్కడ పార్క్ చేసిన వాహనాలను అన్నీటిని తగలపెట్టేశాడు.వాహనాలన్నీ మాడి మసైపోయాయి. నిందితుడిని అదే బిల్డింగ్ లో అద్దెకు ఉంటున్న గోపాల్ బందోబా గవాళి(28)గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.ఈ ఘటన ఆదివారం (అక్టోబర్ 6, 2019)న దండేకర్ వంతెనకు దగ్గరలో ఉన్న విఘ్నహర్తా సొసైటీ పార్కింగ్ ప్రాంతంలో జరిగింది.

అదే బిల్డింగ్ లో ఉంటున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ…నేను గత ఏడది స్కూటర్ కొన్నాను. ఈ సంఘటనలో నా స్కూటర్ పూర్తిగా దెబ్బతింది. తెల్లవారుజామున 2 గంటలకు గ్రౌండ్ ఫ్లోర్ నుండి పెద్ద శబ్దాలు విన్నాను. వాహనాలన్నీ కాలిపోతున్నట్లు చూసిన వెంటనే అక్కడి నివాసితులందరూ వారి ఇళ్ళ నుండి బకెట్లు బకెట్లు నీటితో మంటలను ఆపడానికి ప్రయత్నించాము. 

ఇంకా మాలో ఒకరు నగర అగ్నిమాపక దళ అధికారులను పిలిచారు. మంటలను ఆర్పడానికి మేము అన్ని ప్రయత్నాలు చేసాము. మంటలు వాహనాల ఇంధన ట్యాంకులకు చేరుకున్నందున మంటలను అదుపులోకి తీసుకురావడం చాలా కష్టం అయిందని తెలిపారు..