OMG: ATM మెషిన్ ఎంత సింపుల్ గా కాజేశారో చూడండి

  • Publish Date - December 29, 2019 / 02:12 AM IST

పుణెలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ATM సెంటర్ లోకి చొరబడి మెషిన్‌ను దోపిడి చేశారు.. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. తమతో చెచ్చుకున్న ఇనుప పరికరాల ద్వారా ఏటిఎంను తెరిచే ప్రయత్నం చేశారు. 

అది కుదరక ఏటీఎం మెషిన్‌కు కారుకు తాళ్లు కట్టి వాహనాన్ని స్పీడ్ గా ముందుకు తీసుకువెళ్లారు. అంతే మెషిన్ ను వాహనంలో ఎక్కించుకుపోయారు. చాలా తెలివిగా దంగతనం చేసారుగానీ సీసీటివి గురించి ఎవ్వరు ఆలోచించలేదు. ఇక దొంగతనం జరిగిన సమయంలో ఏటిఎంలో సెక్యూరిటీ గార్డులు లేకపోవడం ఈ దోపిడీకి కారణమైందని పోలీసులు తెలిపారు. 

ప్రస్తుతం పోలీసులు ఆ దొంగలను వెతికే పనిలో ఉన్నారు. ఆ సమయంలో ఏటీఎంలో ఎంత డబ్బు ఉందనేది తెలియలేదు.  అంతేకాదు ఈ దొంగతనానికి పాల్పడ్డ దుండగులు, మహారాష్ట్ర, బీహర్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారిగా అనుమానం ఉందన్నారు.