Punjab: గుడిసెకు నిప్పంటుకుని ఏడుగురు మృతి
పంజాబ్‌లో దారుణం జరిగింది. గుడిసెకు నిప్పంటుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరిలో ఐదుగురు పిల్లలే ఉన్నారు.
- Narender Thiru
- Published On : April 20, 2022 / 09:05 PM IST
Punjab
Punjab: పంజాబ్‌లో దారుణం జరిగింది. గుడిసెకు నిప్పంటుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరిలో ఐదుగురు పిల్లలే ఉన్నారు. పంజాబ్, లూథియానాలోని టిబ్బా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సురేష్ సాహ్ని, రీనా దేవి జంట తమ పిల్లలతో కలిసి గుడిసెలో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది.
Crime news : పోర్న్ వీడియోలు చూసి.. భార్యను హత్యచేసిన భర్త.. అసలేం జరిగిందంటే?
ఈ ఘటనలో జంటతోపాటు రాఖీ, మీనాక్షి, గీత, చందా అనే కూతుళ్లు, సన్నీ అనే రెండేళ్ల కొడుకు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల కుటుంబం బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లా నుంచి వలస వచ్చిందని పోలీసులు చెప్పారు. కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు.
