ఆస్తి కోసం 75 ఏళ్ల తల్లిని న్యూడ్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్

  • Publish Date - May 20, 2020 / 03:16 AM IST

50ఏళ్ల వయస్సున్న వ్యక్తి 75 ఏళ్ల మహిళ.. అందులోనూ తల్లి న్యూడ్ ఫొటోలను వాట్సప్‌లో పంపి వారసత్వంగా వస్తున్న ఆస్తుల కోసం బ్లాక్‌మెయిల్‌కు దిగాడు ఓ కొడుకు. సిగ్గుచేటు అయిన ఈ ఘటన రాజస్థాన్ లోని కోటా జిల్లాలో జరిగింది. నిందితుడ్ని దీపక్ తివారీగా పోలీసులు గుర్తించారు. దీపక్ బంధువులు అందరూ ఉన్న వాట్సప్ గ్రూపులో ఆ న్యూడ్ ఫొటోలు షేర్ చేసేశాడు. 

వారసత్వంగా వస్తున్న ఆస్తి కాగితాలను తనకి అప్పగించాలని బెదిరించాడు. ప్రస్తుతం దీపక్ అడిషనల్ చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ విచారణ నిమిత్తం పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధితురాలి భర్త కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. శివపురి ఏరియా దాదాబరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. మే 13న 75ఏళ్ల పోలీసులకు ఇలా ఫిర్యాదు చేసింది. 

‘చనిపోయిన నా భర్త పేరిట హోమం నిర్వహిస్తున్నాం. ఆ సమయంలో నా కొడుకు వచ్చి నాపై ఏదో చల్లాడు. దాంతో నా శరీరమంతా దురద, మంటగా అనిపించడంతో స్నానం చేయడానికి బాత్రూమ్ కి వెళ్లా’ అని మహిళ తెలిపింది. ఆ సమయంలో నిందితుడు ఆమె ఫొటోలు తీసి బంధువులందరూ ఉన్న వాట్సప్ గ్రూపుకు పంపాడు. 

తర్వాతి రోజు బంధువుల్లో ఒకరు మహిళకు ఈ విషయం తెలియజేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. మే 16న అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ బ్లాక్‌మెయిల్‌కు ప్రయత్నించి ఆస్తిని చేజిక్కించుకోవాలని ప్రయత్నించాడు. నిందితుడిపై సెక్షన్ 509A, 509B కింద కేసులు నమోదు చేశామని దాదాబరి పోలీస్ స్టేషన్ ఇన్-ఛార్జి తారాచంద్ తెలిపారు.

Read: కామ పిశాచి : తూర్పుగోదావరి స్వాధార్ గృహంలో వార్డెన్ కీచకపర్వం