హైదరాబాద్ : నేరేడ్ మెట్ ఆర్కేపురం బాలాజీనగర్ కాలనీలో దారుణం జరిగింది. బుల్లెట్ గాయంతో సొహైల్ (22) అనే యువకుడు మృతి చెందాడు. సొహైల్ తండ్రి మహరుద్దీన్ రిటైర్డ్ ఆర్మీ అధికారి. ప్రస్తుతం ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సొహైల్ ది హత్య, ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం (ఏప్రిల్ 30,2019) ఉదయం ఈ ఘటన జరిగింది.
రంగంలోకి దిగిన పోలీసుల కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. తండ్రి మహరుద్దీన్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహరుద్దీన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహరుద్దీన్ దగ్గర లైసెన్స్ గన్ ఉంది. కాగా, తండ్రి మహరుద్దీన్.. కొడుకు సొహైల్ ని కాల్చి చంపినట్టు వార్తలు వచ్చాయి. తండ్రీ కొడుకుల మధ్య వివాదాలు ఉన్నాయని, దాంతో తండ్రే చంపాడని వార్తలొచ్చాయి.
ప్రాథమికంగా హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. సొహైల్ నిద్రిస్తున్న సమయంలో తండ్రే చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నాయి. సొహైల్ నుదుటిపై బుల్లెట్ గాయం ఉంది. పాయింట్ బ్లాంక్ లో కాల్చడం వల్లే అతడు చనిపోయాడని పోలీసులు చెప్పారు. సొహైల్ బెడ్ మీద ఉన్నాడు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు.. తండ్రీ కొడుకుల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మహరుద్దీన్ దగ్గర ఉన్న లైసెన్స్ వెపన్ ను పోలీసులు సీజ్ చేశారు.