హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి

  • Publish Date - April 23, 2019 / 02:52 PM IST

హైదరాబాద్ లో విషాదం నెలకొంది. బైక్ ను టాటా ఏస్ ఆటో రిక్షా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కూకట్ పల్లికి చెందిన నక్కా రవి (35).. (ఏప్రిల్ 22, 2018) సోమవారం రాత్రి మాదాపూర్ లోని మలేషియా టౌన్ షిప్ ఫోర్త్ ఫేజ్ దగ్గర రోడ్డుపై బైక్ ఆపి నిల్చున్నాడు. టాటా ఏస్ గూడ్స్ డ్రైవర్ అజార్ వాహనాన్ని వేగంగా నడుపుతూ బైకును ఢీకొట్టాడు.

దీంతో బైక్ మీద ఉన్న వ్యక్తి కింద పడటంతో తలకు తీవ్ర గాయమైంది. క్యాబ్ డ్రైవర్ చికిత్స కోసం అతన్ని ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ నక్కా రవి మృతి చెందాడు. టాటా ఏస్ డ్రైవర్ అజార్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : షాకింగ్.. లక్షలు కొట్టేశారు : దొంగల బైక్.. ఈడ్చుకెళ్తున్నా బ్యాగు వదల్లేదు