ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం-ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు మృతి
- murthy
- Published On : December 16, 2020 / 01:05 PM IST
road accident in khammam district : విజయవాడ-చత్తీస్ ఘడ్ జాతీయ రహాదారిపై ఖమ్మంజిల్లాలో ఈ తెల్లవారుఝూమున రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా రోడ్డు కనపడక కారు బోల్తా పడింది. పెనుబల్లిమండలం తుమ్మలపల్లి సమీపంలో కారు బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రకాశం జిల్లాకు చెందిన వారు విజయవాడ మీదుగా ఒడిశా వెళుతుండగా ఈదుర్ఘటన జరగింది. పొగమంచు కారణంగా రోడ్డు కనపడకపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా వ్యాపారం పనుల నిమిత్తం ఒడిశాకు వెళుతున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
