హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు టూ వీలర్‌ను ఢీ కొనడంతో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు జరుగే పరీక్ష రాసేందుకు విద్యార్ధులు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.