పోలీసు అధికారి ఇంట్లో దోపిడీ

  • Publish Date - December 22, 2019 / 01:38 PM IST

దొంగతనం చేయటానికి ఫలానా వాళ్ల ఇల్లే అని ఏమిరాసి ఉండదు చోరశిఖామణులకు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ కన్నంవేసి దొరికినంత దోచుకుని పలాయనం చిత్తగిస్తారు,   ఇ  ఇటీవల రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక పోలీసు అధికారి ఇంటికే కన్నం వేసి దొరికినంత దోచుకుపోయారు దోపిడీ దొంగలు.

రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్ గూడ లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకున్న దోపిడీ దొంగలు….అర్ధరాత్రి వేళ ఓ పోలీసు అదికారి ఇంటిని లూటీ చేశారు. దీనితో పాటు మరో నాలుగు ఇళ్లలోనూ చోరీకి పాల్పడి బంగారం. నగదు ఎత్తుకెళ్లారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు  క్లూస్ టీమ్ సహాయంతో  ఆధారాలు సేకరించి  దొంగల కోసం గాలిస్తున్నారు