WhatsApp యూజర్లను మభ్యపెట్టేందుకు కొత్త స్కాంతో ఎదురుచూస్తున్నారు మోసగాళ్లు. వాట్సప్ అఫీషియల్ మెసేజ్ అంటూ.. వెరిఫికేషన్ అడుగుతున్నారు. కొంచెం పరిశీలించి చూస్తే ఫేక్ అని తెలిసిపోయే ఈ మెసేజ్‌లతో చాలా మంది మోసపోతున్నారు. మెసేజ్ రాగానే అలర్ట్ అయి వెరిఫికేషన్ కోడ్ పంపేయడంతో స్కామర్ల చేతిలో చిక్కుపోతున్నారు.
ఓ ట్విట్టర్ యూజర్.. తన చాట్ హిస్టరీలో ఉన్న స్క్రీన్ షాట్ తీసి WAbetainfoకు ట్వీట్ చేశాడు. వెరిఫై చేయాలని రిక్వెస్ట్ చేశాడు. దానికి సమాధానంగా ఇది పూర్తిగా ఫేక్. ఇటువంటి మెసేజ్ లు వాట్సప్ ఎప్పుడు చేయదని రిప్లై ఇచ్చింది.
‘ఇది పూర్తిగా ఫేక్. వాట్సప్ మీకు వాట్సప్ మెసేజ్‌లు అస్సలు పంపదు. ఒకవేళ ప్రపంచ వ్యాప్తంగా జరిగే అంశాలపై చేసే మెసేజ్‌లు చాలా అరుదు. దాంతో పాటు గ్రీన్ కలర్ లో ఉండే టిక్ మార్కు ఉంటుంది. దాని చూసైనా జాగ్రత్తపడండి’ అంటూ ట్వీట్ చేసింది.
అసలు ఆ మెసేజ్‌లో ఏముందో తెలుసా.. ‘మేం ఐడీ వెరిఫికేషన్ కోసం మీకొక రిక్వెస్ట్ పంపుతున్నాం’ కొత్త డివైజ్ లో వాట్సప్ పనిచేయాలంటే ఇది తప్పనిసరి అనేది ఆ మెసేజ్ సారాంశం. ఆ ఐకాన్ కూడా వాట్సప్ సింబల్ లోనే ఉంటుంది. దాంతో యూజర్లు వాట్సప్ నుంచే వచ్చిందనుకుంటుంటారు.
WAbetainfo ఉదహరణగా ఓ మెసేజ్ చేసింది. అందులో గ్రీన్ కలర్ టిక్ తో మెసేజ్.. చాట్ బార్ కనిపించకపోవడం వంటికి చూస్తే రిప్లై ఇవ్వకపోవడమే మంచిది. వాట్సప్ యూజర్లకు అఫీషియల్ ప్రకటన మాత్రమే చేస్తుంది. పైగా వాట్సప్ కు మీ పర్సనల్ వివరాలు అవసరం ఉండవు. ఇటువంటి స్క్రీన్ షాట్లను పట్టించుకోవద్దు.
ఎవరైనా మీ ఫోన్ ను హ్యాక్ చేయాలనుకుంటే వారు SMS వెరిఫికేషన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది లేకుండా ఏ యూజర్ అయినా వెరిఫికేషన్ పద్ధతి పూర్తి చేయలేడు.