తొమ్మిదో తరగతి విద్యార్ధినిపై స్కూల్ ప్రిన్సిపాల్‌ అత్యాచారం

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్పిన స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్ధినిపై అత్యాచారం చేశాడు.

  • Publish Date - November 23, 2019 / 03:51 PM IST

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్పిన స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్ధినిపై అత్యాచారం చేశాడు.

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్కూల్ ప్రిన్సిపల్ దారుణానికి ఒడిగట్టాడు. ఓ విద్యార్ధినిపై అత్యాచారం చేశాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగరంలో జానెట్‌ జార్జ్‌ మెమోరియల్‌ స్కూల్ లో ప్రసాదరావు ప్రిన్సిపాల్‌ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో అదే స్కూల్ లో 9వ తరగతి చుదువుతున్న విద్యార్ధినిపై ప్రసాదరావు అత్యాచారం చేశాడు. 

బాధితురాలు చైల్డ్‌లైన్‌కి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు అమ్మాయికి కీచక ప్రిన్సిపాల్‌ నుంచి విముక్తి కల్గించారు. ప్రిన్సిపాల్‌ భార్య సారధి కూడా తమను వేధింపులకు గురిచేసేదని విద్యార్ధులు తెలిపారు. దీంతో ప్రిన్సిపాల్‌ ప్రసాదరావు, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

బాధితురాలి తల్లిదండ్రులు ప్రిన్సిపల్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు ప్రసాదరావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.