రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం, ప్రిలిమినరీ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం రేపిన మహిళ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం, ప్రిలిమినరీ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మహిళ మెడకు ఉరి వేసి, అనంతరం బండరాయితో మోది హత్య చేసినట్లు వైద్యులు గుర్తించారు. అలాగే మహిళ గొంతు నులిమినట్లు ఆనవాళ్లు గుర్తించారు. మృతురాలు మహారాష్ట్ర లేదా గుజరాత్ కు చెందిన వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో మృతురాలి ఆభరణాలు కీలక ఆధారాలుగా మారాయి. వాటి సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రక్తనమూనాలు, విశ్రా శాంపిల్స్ ఉస్మానియా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిచారు. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలు వివాహితగా వైద్యులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం, ఆర్థిక గొడవలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మహిళ దారుణ హత్య కేసును పోలీసులు చాలెంజ్ గా తీసుకున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడి కేసును చేధించేందుకు పోలీసులు ముమ్మరంగా, లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తంగా గమినిస్తే మూడు అంశాలుగా విడదీశారు. పోస్టుమార్టం జరిగాక పోలీసులు కొన్ని అంశాలు సేకరించారు. అలాగే మహిళ ఒంటిపై బంగారు ఆభరణాలు, మరోవైపు పోలీసుల కోణంలో జరుపుతున్న దర్యాప్తులో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో నాలుగు వాహనాలు అనుమానంగా ఉన్నాయి. వాహనాలకు సంబంధించిన అడ్రస్ లను కూడా ట్రేస్ అవుట్ చేసినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు..వారి అభిప్రాయం కూడా పోలీసులకు వెల్లడించారు.
See Also | దిశ తరహా ఘటన…మహిళపై అత్యాచారం చేసి హత్య
తొలుత మహిళను హతమార్చిన తర్వాత వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి కల్వర్టు కింత పడేసి అక్కడ తలపై మోదడంతో తల నుజ్జునుజ్జు కావడంతో స్పాట్ లోనే చనిపోచయినట్లు తెలుస్తోంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మహిళ వివాహిత, ఆమెకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లను సేకరించారు. దీనికి సంబంధించి ప్రైమరీ రిపోర్టు పోలీసులకు అందించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కొన్ని విషయాలను పోలీసులకు వెల్లడించారు. మహిళలకు స్పోకింగ్ అలవాటు ఉంటుంది. ఆమె వివాహిత, సర్జరీ కూడా జరిగింది. సిజరింగ్ కూడా జరిగిందని చెప్పారు.
మహిళ చిరునామాను తెలుసుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తే పోస్టుమార్టం పూర్తి అయింది కనుక డెడ్ బాడీని కూడా అప్పగించే అవకాశం ఉంది. మరోవైపు సంఘటనా స్థలంలో బంగారు ఆభరణాలు లంభించాయో లాకెట్, రింగ్, కమ్మలు వీటికి సంబంధించి కేడియమ్ బంగారం ఎక్కడ తయారైంది. డిజైన్స్ ఎక్కడున్నాయి… అలాగే ఈ ఆభరణాలను ఏ ప్రాంతం వారు ధరిస్తారన్న కోణంలో పోలీసులో ఒక బృందం దర్యాప్తు చేస్తోంది. సీసీ కెమెరాలు కూడా కీలకంగా మారాయి. తంగెడ్ పల్లి గ్రామంలో రోడ్డు కల్వర్టు వికారాబాద్ నుంచి రంగారెడ్డి మధ్యలో మార్గంమధ్యలో జరిగింది కాబట్టి ఎంట్రీ, ఎగ్జిట్ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళపై అత్యాచారం చేశారా లేదా అనే విషయంలో డీఎన్ ఏ రిపోర్టు వస్తే తెలుస్తుంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. నిన్న ఉదయం తంగడపల్లి శివారులో వంతెన కింద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్య చేసిన ఆనవాళ్లు ఉండటంతో అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళకు సంబంధించిన వస్తువులు, దుస్తులు గానీ ఘటనాస్థలంలో లభించకపోవడంతో ఆమె వివరాలను సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది.
20 నుంచి 30 సంత్సరాల వయస్సు ఉన్న మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. శరీరంపై అనేక గాయాలు ఉన్నాయి. మహిళ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకపోవడం, వివస్రను చేసి తీసుకొచ్చిన వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చి పరారు అయినట్లు తెలుస్తోంది. క్లూస్ టీమ్స్ ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకుని ఘటన ఏవిధంగా జరిగిందని పరిశీలించారు