Serial Actress Nagavardhini: ప్రియుడిపై మర్డర్ స్కెచ్.. అడ్డంగా బుక్కయిన టీవీ సీరియల్ నటి!

బుల్లితెరపై టెలికాస్ట్ అయ్యే గుప్పెడంత మనసు, గుండమ్మ కథ వంటి సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని తన యాక్టింగ్‌తో మంచి గుర్తింపును తెచ్చుకుంది. తన మొదటి బాయ్‌ఫ్రెండ్‌ను అడ్డు తొలగించుకోవాలని రెండో ప్రియుడితో కలిసి అతడిపై హత్యాయత్నానికి పాల్పడింది ఈ నటి. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

Serial Actress Nagavardhini Plans To Kill Boyfriend

Serial Actress Nagavardhini: టీవీల్లో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ చూస్తే మనకు ఎన్నో ట్విస్టులు కనిపిస్తుంటాయి. అయితే అలాంటి ట్విస్టులు నిజజీవితంలోనూ జరుగుతుంటాయి. కానీ, ఇక్కడ విశేషమేమిటంటే.. అలా సీరియల్స్‌లో నటించే ఓ నటి నిజజీవితంలోనే ఈ ట్విస్టు జరగడం. రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిపై హత్యాయత్నానికి పాల్పడి, కటకటాల పాలైంది ఓ సీరియల్ నటి.

Serial Actress: అర్ధరాత్రి తప్పతాగి సీరియల్ నటీనటుల రచ్చ.. అరెస్ట్!

బుల్లితెరపై టెలికాస్ట్ అయ్యే గుప్పెడంత మనసు, గుండమ్మ కథ వంటి సీరియల్స్‌లో నటిస్తున్న నాగవర్ధిని తన యాక్టింగ్‌తో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆమె హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో సూర్య అనే వ్యక్తిని ప్రేమిస్తూ అతడితో గతకొంతకాలంగా ఒకే గదిలో జీవిస్తోంది. అయితే సూర్య స్నేహితుడైన శ్రీను కూడా అదే గదిలోకి దిగాడు. శ్రీను వచ్చిన కొన్నిరోజుల్లోనే అతడికి దగ్గరయ్యింది నాగవర్ధిని. ఈ క్రమంలో వారు ప్రేమలో పడ్డ విషయం తెలుసుకున్నాడు సూర్య. వెంటనే వారిద్దరినీ సూర్య మందలించాడు. తరుచూ ముగ్గురికి ఈ విషయంపై గొడవలు జరుగుతుండేవి.

Serial Actresses: దొంగతనం కేసులో అరెస్టైన ఇద్దరు నటీమణులు!

కానీ, శ్రీనుతోనే ఉండాలని నాగవర్ధిని నిర్ణయించుకోవడంతో సూర్య అదే అపార్ట్‌మెంట్‌లో 4వ అంతస్తుకు మారాడు. అయితే అతడి అడ్డును తొలగించుకోవాలని శ్రీనుతో కలిసి ప్లాన్ చేసిన నాగవర్దిని, సూర్యను బిల్డింగ్‌పై నుంచి కిందకు తోసేసింది. తీవ్ర గాయాలపాలైన సూర్య, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, సూర్య స్నేహితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నాగవర్ధినిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.